పేదల ప్రాణాలతో చెలగాటం | - | Sakshi
Sakshi News home page

పేదల ప్రాణాలతో చెలగాటం

Apr 2 2026 9:04 AM | Updated on Apr 2 2026 9:04 AM

జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసిన ఆసుపత్రులు

రూ.80 నుంచి రూ.100 కోట్ల మేర బకాయిలు

భీమవరం(ప్రకాశం చౌక్‌): రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి బకాయిల కోసం ఇప్పటికే రెండుసార్లు సేవలు నిలిపేయగా, తాజాగా బుధవారం నుంచి మూడోసారి సమ్మె బాట పట్టాయి. జిల్లాలో మొత్తం 30 నెట్‌వర్క్‌ ఆసుపత్రులు ఉండగా, బుధవారం నాటికి 15 ఆసుపత్రులు సేవలు నిలిపివేశాయి. మిగిలిన ఆసుపత్రులు కూడా అదే బాటలో పయనించే యోచనలో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకుండా కోట్లాది రూపాయిల బకాయిలు పెట్టింది. జిల్లాలో ఉన్న నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు కోట్లు రూపాయలు బకాయిలు ఉన్నాయి. బకాయిలు చెల్లించకుండా సేవలు అందించాలని ఒత్తిడి చేయడం, బిల్లులపై డిస్కౌంట్ల పేరుతో బేరసారాలకు దిగడంతో విసిగిపోయిన యాజమాన్యాలు మా వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నాయి.

పేదల ప్రాణాలతో చెలగాటం

ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యోగా డే వంటి కార్యక్రమాల కోసం రూ.300 కోట్లు ఖర్చు పెట్టే ముఖ్యమంత్రి చంద్రబాబు పేదల ప్రాణాలు కోసం ఆరోగ్యశ్రీకి ఖర్చు చేయడానికి నిర్లక్ష్యం చేయడంతో పేదల ప్రాణాలకు ముప్పు వచ్చింది. గతంలో నెట్‌వర్క్‌ ఆసుపత్రులు సమ్మె చేయడంతో పేద ప్రజలు వైద్యం కోసం విలవిల్లాడి అప్పులు చేసుకుని వైద్య సేవలు పొందారు. మళ్లీ అదే పరిస్థితిను కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. బకాయిల కోసం మళ్లీ సమ్మెకు దిగి వైద్య సేవలు నిలిపేయడంతో పేద, మధ్య తరగతి ప్రజలు వైద్య సేవలకు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసరం వైద్యం కోసం దూర ప్రాంతాల ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. స్థానికంగా వైద్యం అందాల్సిన పరిస్థితి లేకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లే లోపు ప్రాణాలు పోతాయని ఆందోళన చెందుతున్నారు. నెట్‌వర్క్‌ కాకుండా ప్రైవేట్‌ ఆసుపత్రులల్లో వైద్యం పొందాలంటే రూ.లక్షల్లో ఖర్చు చేయడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆరోగ్యశ్రీ హెల్ప్‌ డెస్క్‌

ఆరోగ్యశ్రీ సేవలు బంద్‌

జిల్లాలో 15 ఆసుపత్రుల్లో నిలిచిన వైద్యం

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడోసారి సమ్మె

జిల్లాకు దాదాపు రూ.100 కోట్ల బకాయిలు

ఆందోళనలో రోగులు, బంధువులు

తణుకు

07

తాడేపల్లిగూడెం

05

పాలకొల్లు

01

నరసాపురం

02

జిల్లాలోని 30 నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు ప్రభుత్వం దాదాపు రూ.100 కోట్ల వరకు బకాయి పడింది. ఒక్కో ఆసుపత్రికి రూ.3 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు బకాయిలున్నాయి. సాధారణ ఆసుపత్రులకు రూ.3 కోట్ల వరకు బకాయిలు ఉంటే, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకు రూ.10 నుంచి రూ.30 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. దీంతో అప్పులు చేసి మరీ ఆసుపత్రులను నిర్వహించాల్సి వస్తోందని అసోసియేషన్‌ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బకాయిలు చెల్లించండి అని అడుగుతున్న నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోగా, 10 నుంచి 15 శాతం డిస్కౌంట్‌ ఇస్తేనే బిల్లులు విడుదల చేస్తామంటూ బేరాలు ఆడుతోంది. ఆఖరికి ఆసుపత్రులు 4 శాతం డిస్కౌంట్‌కు అంగీకరించినా నిధులు విడుదల చేయడంలో తాత్సారం చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement