పెనుగొండ: మహిళలకు ఉపాధి కల్పనతో పాటు పరిశ్రమల స్థాపనకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. బుధవారం ఆచంటలో శ్రీస్వర్ణాంధ్ర 2047శ్రీలో భాగంగా విజన్ యాక్షన్ ప్లాన్ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. రాష్ట్రంలోనే ఇది మొదటి భవనం కావడం విశేషమన్నారు. ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల్లో పేదరిక నిర్మూలన, ప్రతి కుటుంబానికి ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధి, ఇంటింటికీ సురక్షిత తాగునీటి సరఫరా తదితర అంశాలు కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో దాసిరాజు, ప్రత్యేకాధికారి జి. పిచ్చయ్య, ఏఎంసీ చైర్మన్ కేతా విజయలక్ష్మి, ఎంపీపీ దిగమర్తి సూర్యకుమారి, జడ్పీటీసీ ఉప్పలపాటి సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్, ఎమ్మెల్యే పితానిలు బుధవారం ఆచంట రావిగుంటలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు.
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో పేదల గృహ నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసి లక్ష్యాలను సాధించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, ఇందులో నిర్లక్ష్యం వహించే సిబ్బంది, ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ నాగరాణి హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్‌లో గృహ నిర్మాణాల పురోగతిపై మండలాల వారీగా సమీక్షించారు.


