కామవరపుకోట: స్థానిక వీరభద్ర స్వామి కోటగట్టును పక్కన ఉన్న ఆగర్తి చెరువును పూడ్చి సొమ్ము చేసుకుంటున్నారు కూటమి ప్రభుత్వ నాయకులు. గత కొన్ని రోజుల నుంచి అర్ధరాత్రి సమయంలో విచ్చలవిడిగా టిప్పర్లతో మట్టిని తీసుకొచ్చి చెరువును పూడుస్తున్నారు. సెంటున్నర స్థలాన్ని రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నా అధికారులు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపి చెరువును పూడుస్తున్న వారిపై చర్య తీసుకోవాలని, లేకుంటే దీనిపై జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని స్థానికులు తెలిపారు.


