పెంటపాడు: ముందున్న వాహనాన్ని లారీ ఢీకొని లారీ డ్రైవర్ మృతి చెందాడు. వివరాల ప్రకారం ప్రత్తిపాడు ఆటోనగర్ వద్ద హైవే మరమ్మతు పనులు జరగుతున్నాయి. ఏలూరు వైపు నుంచి తణుకు వైపు వెళుతున్న ధాన్యం లోడు లారీ ముందున్న రహదారి సేప్టీ వాహనాన్ని ప్రమాదవశాత్తూ ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం తీవ్రంగా దెబ్బతినగా, లారీ డ్రైవర్ మాచర్లకు చెందిన రాగిపిండి శ్రీనివాసరెడ్డి (48) లారీ క్యాబిన్‌లో ఇరుక్కొని మృతి చెందాడు. పెంటపాడు పోలీసులు ఇరుక్కొన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేశారు. ఎస్సై స్వామి ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.


