●డ్రెయినేజీ ఆక్రమణలు తొలగించండి | - | Sakshi
Sakshi News home page

●డ్రెయినేజీ ఆక్రమణలు తొలగించండి

Mar 31 2026 7:14 AM | Updated on Mar 31 2026 7:14 AM

ఏలూరులోని ప్రతి డ్రెయినేజీ ఆక్రమణకు గురైందని, ప్రతి పుట్‌పాత్‌ది ఇదే పరిస్థితి అని.. తక్షణం ఆక్రమణలను తొలగించాలని సామాజిక కార్యకర్త ఎన్‌.స్వర్ణలత డిమాండ్‌ చేశారు. ఏలూరు నగరంలోని సమస్యలపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఎండార్స్‌మెంట్‌లు ఇస్తున్నారే తప్ప చర్యలు మాత్రం ఉండటం లేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ సోమవారం ఆమె వినూత్నంగా నిరసన తెలిపారు. ముందుగా కలెక్టరేట్‌ వద్ద నిరసన వ్యక్తం చేసి.. అక్కడ నుంచి ఏలూరు కార్పొరేషన్‌ కార్యాలయానికి వెళ్లి అధికారులను నిలదీశారు.

– ఏలూరు (టూటౌన్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement