మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం

Mar 29 2026 6:47 AM | Updated on Mar 29 2026 6:47 AM

మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం చికిత్స పొందుతూ మృతి

తణుకు అర్బన్‌: తణుకు పట్టణానికి చెందిన ఒక వ్యక్తి అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.శ్రీనివాస్‌ తెలిపారు. అజ్జరం రోడ్డులోని ఇందిరమ్మ కాలనీకి చెందిన సంపు దుర్గాప్రసాద్‌ గత కొంతకాలంగా మతిస్థిమితం లేకుండా ఉంటున్నారు. మూడు నెలల క్రితం బ్రెయిన్‌ ఆపరేషన్‌ జరగడంతో ఇంట్లోనే ఉంటున్న ఆయన, ఈ నెల 25న మధ్యాహ్నం ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించినా ఆచూకీ దొరకలేదు. సోదరుడు ఏసుబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ముదినేపల్లి(కై కలూరు) : కడుపునొప్పి తాళలేక పురుగు మందు తాగి అత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వ్యక్తి చికిత్స పొందుతూ శనివారం మరణించాడు. ముదినేపల్లి పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం చినకామనపూడికి చెందిన నున్న శ్రీనివాసరావుకు 4 ఏళ్ల క్రితం శ్రీనివాసరావుకు బ్రెయిన్‌ స్టోక్‌ వచ్చింది. అప్పటి నుంచి తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఈ నెల 25న కడుపునొప్పి, చిన్ని కుమార్తెకు వివాహం కాలేదనే బాధతో పురుగుమందు తాగాడు. అతనిని ముదినేపల్లి అస్పత్రికి తీసుకువెళ్ళి, అక్కడ నుంచి గుడివాడ ఈవీఆర్‌ ఆస్పత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించారు. చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement