ఇది న్యాయమా ? | - | Sakshi
Sakshi News home page

ఇది న్యాయమా ?

Mar 25 2026 6:49 AM | Updated on Mar 25 2026 6:49 AM

ఇది న్యాయమా ? నమ్మించి మోసగించారు ఐక్యంగా పోరాడతాం ●

గత ఎన్నికల సమయంలో మేమున్నామంటూ వాగ్దానం చేశారు. ఓట్లేసి గెలిపించినందుకు ఇప్పుడు అడుగుతుంటే ముఖం చాటేస్తున్నారు. ఇది న్యాయం కాదు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి.

– వీఎస్‌పీ శ్రీనివాస్‌,

యూటీఎప్‌ మండల ప్రధాన కార్యదర్శి, ఉండి

ఎన్నికలప్పుడు మేం ఉన్నాం.. అధికారంలోకి రాగానే మన ప్రభుత్వం చెప్పింది చెప్పినట్టు చేసేస్తుంది అని నమ్మించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు రెండేళ్ళవుతుంది. చెప్పిన మాట ఒక్కటీ నెరవేర్చలేదు. ఉద్యోగులను చిన్నచూపు చూడొద్దు.

– కే.వామనమూర్తి, యూటీఎఫ్‌ మండలాధ్యక్షుడు

మాకు సహకరిస్తే మేం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని వాగ్దానం చేశారు. ఇప్పుడెందుకు అమలు చేయరు. నమ్మినందుకు నట్టేట ముంచేస్తారా? రాష్ట్రంలో ఉద్యోగులంతా ఐక్యమవుతున్నారు. అమలుకు మహాపోరాటం జరగబోతుంది.

– ఆర్‌వీఎస్‌ నారాయణ, ఆకివీడు యూటీఎఫ్‌ మండలాధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement