వైఎస్సార్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ మద్దతు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ మద్దతు

Mar 25 2026 6:49 AM | Updated on Mar 25 2026 6:49 AM

వైఎస్సార్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ మద్దతు

తణుకు అర్బన్‌: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో తణుకులో మంగళవారం నిరాహార దీక్ష నిర్వహించారు. యూటీఎఫ్‌ నిరాహార దీక్షకు మద్దతు పలికిన వైఎస్సార్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు మురాల సుధాకర్‌ మాట్లాడుతూ పీఆర్సీ కమిషన్‌ను తక్షణమే నియమించాలని, ఐఆర్‌ వెంటనే ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌ బకాయిల విడుదలతోపాటు పెన్షనర్స్‌ సమస్యలు తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. భవిష్యత్‌ పోరాటాల్లో వైఎస్సార్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ కూడా పోరాటానికి దిగుతుందని అన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు పి.విజయరామరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.క్రాంతి కుమార్‌, అత్తిలి అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు జి.రమేష్‌, చిన వెంకట్రావు, ఇరగవరం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎంవీ రాఘవులు, కె.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement