ఆకివీడు: పేకాట స్థావరాలపై సోమవారం పోలీసులు దాడులు చేశారు. ‘ఆకివీడులో యథేచ్ఛగా జూద క్రీడలు’ శీర్షికతో సాక్షిలో ప్రచురితమైన కథనానికి పోలీసులు స్పందించారు. పలు ప్రాంతాల్లో గాలింపు చేశారు. మండలంలోని దుంపగడప శివారు ప్రాంతంలో పేకాట స్థావరంపై దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.7,800 స్వాధీనం చేసుకోగా.. సిద్ధాపురం శివారు ప్రాంతంలో పేకాటస్థావరంపై దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.6,200 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ హనుమంతు నాగరాజు చెప్పారు.


