కార్యకర్తలకు పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

కార్యకర్తలకు పెద్దపీట

Mar 24 2026 6:48 AM | Updated on Mar 24 2026 6:48 AM

కార్యకర్తలకు పెద్దపీట

రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చేందుకు జనం సిద్ధం

ప్రభుత్వాన్ని ప్రశ్నించండి

సాక్షి, భీమవరం: ప్రజల పక్షాన కూటమి వంచనపై పోరుబాట, కూటమి స్థానిక నేతల అక్రమాలను ఎండగట్టడం, స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌)పై అవగాహన, సంస్థాగతంగా క్షేత్రస్థాయి నుంచి వైఎస్సార్‌సీపీ బలోపేతం చేసే దిశగా వైఎస్సార్‌సీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రీజనల్‌ కో–ఆర్డినేటర్‌గా నియామకం అనంతరం తొలిసారి జిల్లాకు విచ్చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు భీమవరంలో ఘన స్వాగతం లభించింది.

రెట్టించిన ఉత్సాహంతో శ్రేణులు

వైఎస్సార్‌సీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అధ్యక్షతన సోమవారం పార్టీ జిల్లా క్యాంపు కార్యాలయంలో జరిగింది. అమర్నాథ్‌ ముఖ్య అతిథిగా హాజరైన సమావేశంలో పార్టీ జిల్లా పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, ఎమ్మెల్సీలు వంక రవీంద్ర, కవురు శ్రీనివాస్‌, మాజీ మంత్రులు కా రుమూరి నాగేశ్వరరావు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, నియోజకవర్గ కో–ఆర్డినేటర్లు చినమిల్లి వెంకటరాయుడు, గుడాల శ్రీహరిగోపాలరావు, పీవీఎల్‌ నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు. జిల్లా అ ధ్యక్షుడు ప్రసాదరాజు మాట్లాడుతూ జిల్లాలో గ్రా మ, మండల, జిల్లాస్థాయి కమిటీల నియామకం దాదాపు పూర్తి కాగా డిజిటలైజేషన్‌ నెలాఖరుకు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్టు వివరించారు. ప్రజల పక్షాన పార్టీ పిలుపు ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని జిల్లాలో పార్టీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తూ విజయవంతంగా నిర్వహిస్తున్నామని వివరించారు.

ఘనంగా పార్టీ క్యాంపు కార్యాలయం ప్రారంభం

జిల్లా కేంద్రం భీమవరంలోని ఉండి రోడ్డులో మల్టీప్లెక్స్‌ పక్కన నూతనంగా ఏర్పాటుచేసిన వైఎస్సార్‌సీపీ జిల్లా క్యాంపు కార్యాలయాన్ని రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ అమర్నాథ్‌ ప్రారంభించారు. ప్రతి నా యకుడు, కార్యకర్తకూ పార్టీ కార్యాలయం దేవాల యంతో సమానమని, రీజనల్‌ కో–ఆర్డినేటర్‌గా తొ లిసారి జిల్లాకు వస్తూనే జిల్లా క్యాంపు కార్యాలయం ప్రారంభించే అవకాశం కలగడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు.

అక్రమాలపై పోరాడండి

జిల్లాలో త్వరితగతిన గ్రామ, మండల, జిల్లా కమి టీల నియామకం చేయడం పట్ల జిల్లా నాయకత్వం, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ శ్రేణులను రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ అమర్నాథ్‌ అభినందించారు. జగన్‌ 2.0 పాలనలో కార్యకర్తలకు పెద్దపీట వేయనున్నారని స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌ ఆదేశాలకు అనుగుణంగా అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. స్థానికంగా కూటమి నేతలు చేస్తున్న అన్యాయాలు, అక్రమాలపై పోరాడాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఓట్లు జాబితాలపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ‘సర్‌’ కార్యక్రమంలో లక్షల ఓట్లు తొలగించారని, ఈ విషయంలో పార్టీ కేడర్‌ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓట్లు తొలగింపులు, చేర్పులపై అవగాహన పెంచుకుని పరిశీలన చేస్తుండాలని అన్నారు. జిల్లాలో కమిటీల నియామకం పూర్తయిన నేపథ్యంలో వచ్చేనెల నుంచి నియోజకవర్గాల వారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. రీజనల్‌ కో–ఆర్డినేటర్‌గా తాను ఇక్కడ ఎవరి మీద పెత్తనం చేసేందుకు రాలేదని, అధినేతకు, పార్టీ కేడర్‌కు మధ్య మెసెంజర్‌ను మాత్రమేనన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఇచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఈ జిల్లాలో గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని, గత ఎన్నికల ఫలితాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. రానున్న మూడేళ్లు చాలా కీలకమని, వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని అమర్నాథ్‌ సూచించారు. పార్టీ మహిళ విభాగం అధ్యక్షురాలు జిల్లా కోడి విజయలక్ష్మి, ఎస్‌ఈసీ సభ్యులు పాతపాటి శ్రీనివాసరాజు, కొట్టు నాగేంద్ర, పార్లమెంట్‌ సెక్రటరీలు ఏఎస్‌ రాజు, మంతెన యోగేంద్రబాబు, వేండ్ర వెంకటస్వా మి, పట్టణ అధ్యక్షుడు గాదిరాజు రామరాజు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, పార్టీ నాయకులు బంధన పూర్ణచంద్రరావు, పుప్పల రామారావు తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ ప్రభుత్వానికి

మాజీ మంత్రి అమర్నాథ్‌ హెచ్చరిక

కూటమి ప్రభుత్వానికి రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ గుడివాడ అమర్నాథ్‌ హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతో కాంగ్రెస్‌, ఇతర పార్టీలు కలిసి పనిచేస్తుండటంతో రాష్ట్రంలో ప్రజల గొంతుకగా పనిచేసిది ఒక్క వైఎస్సార్‌సీపీ మాత్రమే అన్నారు. డ్రగ్స్‌ ను అరికట్టాల్సిన పెద్దలే దానిని వాడుతూ సమాజానికి ఏ సందేశం ఇస్తున్నారో తెలియని పరిస్థితి ఉందంటూ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌యాదవ్‌ వ్యవహారంపై స్పందించారు. భూ కబ్జాలు, డ్రగ్స్‌, అవినీతి వ్యవహరాలు చేసే పరిస్థితుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, కూట మి నేతలు ఉన్నారన్నారు. 20 నెలల్లో రూ.3.5 లక్షల కోట్లు అప్పులు తెచ్చిన చంద్రబాబు ప్రభుత్వం వాటిని వేటికి ఖర్చు చేసిందో తెలియని దుస్థితి ఉందన్నారు. రాష్ట్రంలోని రైతులు, కార్మికులు ఎక్కడా సంతోషంగా లేరన్నారు. రాష్ట్రంలో కోటి మందికి పైగా మహిళలకు న్యాయం చేసిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తన సొంత సోదరికి ఎందుకు అన్యాయం చే స్తారని ప్రశ్నించారు. ఎన్ని మాటలు అంటున్నా మౌనం వహిస్తున్న జగన్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పాలన్నారు. జగన్‌ను ఎదుర్కోలేక 2014 ఎన్నికల్లో లక్ష కోట్లు అన్నారని, ఇప్పుడు చెల్లికి అన్యాయం అంటూ వ్యక్తిత్వ హననం చేస్తున్నా రని విమర్శించారు. కూటమి, కాంగ్రెస్‌ చేస్తున్న దుష్ప్రచారమే తప్ప ఇందులో వాస్తవం లేదని అమర్నాథ్‌ కొట్టిపడేశారు.

కూటమి నేతల అక్రమాలను ఎండగట్టాలి

వచ్చే నెల నుంచి నియోజకవర్గాల వారీగా సమీక్షలు

‘సర్‌’పై అవగాహన కలిగి ఉండాలి

ఉత్సాహంగా వైఎస్సార్‌సీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం

భవిష్యత్‌ కార్యాచరణపై రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ అమర్నాథ్‌ దిశానిర్దేశం

భీమవరంలో పార్టీ జిల్లా క్యాంపు కార్యాలయం ప్రారంభం

ప్రజలకు మెరుగైన వైద్యం, రైతులకు అండగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండలాల్లో ఆరోగ్య, రైతు భరోసా కేంద్రాల నిర్మాణం చేపట్టారని, కూటమి వచ్చాక కొన్నిచోట్ల ఆయా నిర్మాణాలను ఆపేసిందని, వాటిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్‌ సూచించారు. విద్య, వైద్యం, వ్యవసాయం తదితర అన్ని రంగాల్లో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఎన్నికల వాగ్దానాలను తుంగలోకి తొక్కి వంచనతో పాలన సాగిస్తున్నారని పార్టీ రాష్ట్ర కార్యదర్శులు ముప్పిడి సంపత్‌కుమార్‌, పేరిచర్ల విజయనరసింహరాజు, యడ్ల తాతాజీ, ఎస్‌ఈసీ సభ్యులు పెండ్ర వీరన్న, పీడీ రాజు, నాయకులు చిగురుపాటి సందీప్‌, కామన నాగేశ్వరరావు, మేడిద జాన్సన్‌, పాలవెల్లి మంగ తదితరులు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement