తాడేపల్లిగూడెం (టీఓసీ): స్వీపర్లకు పెండింగ్ జీతాలు ఇవ్వాలని ఐఎఫ్‌టీయూ నాయకులు మామిడి దాన వరప్రసాద్ డిమాండ్ చేశారు. ఐఎఫ్‌టీయూ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ స్కూల్స్ స్వీపర్లు, శానిటేషన్ వర్కర్లు సోమవారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఆర్డీఓ డీటీ పోతురాజుకు వినతిపత్రాలు సమర్పించారు. తొలుత ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ట్రిబ్యునల్ తీర్పు, కౌన్సిల్ తీర్మానం మేరకు కనీస వేతనాలు అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న 9 నెలలు జీతాలు వెంటనే ఇప్పించాలని డిమాండ్ చేశారు.
భీమవరం(ప్రకాశం చౌక్): నిబంధనలకు విరుద్ధంగా గర్భస్థ శిశువుల లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినా, సహకరించినా చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ జి.గీతాభాయ్ హెచ్చరించారు. సోమవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో జిల్లాస్థాయి గర్భస్థ పిండ లింగ నిర్ధారణ కమిటీ సలహా సంఘ సమావేశం నిర్వహించారు. జి ల్లాలోని ఆస్పత్రులు, స్కానింగ్ కేంద్రాలను క్ర మం తప్పకుండా తనిఖీలు చేయాలని ఆదేశించారు. స్కానింగ్ కేంద్రాల్లో రిజిస్టర్లను పరిశీలించాలన్నారు. ఆడపిల్లల నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఏపీపీ ఎం.వెంకటేశ్వరరావు, డీఏఈఓ డాక్టర్ డి.సుధాలక్ష్మి, గైనకాలజిస్ట్ సుబ్బలక్ష్మి, డీపీఆర్‌ఓ టి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
భీమవరం(ప్రకాశం చౌక్): పోలీస్‌స్టేషన్లకు వ చ్చే సామాన్యుల సమస్యలపై అలసత్వం వద్దని, త్వరితగతిన న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మిం సూచించారు. సోమవారం గొల్లలకోడేరులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పోలీస్ పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదులు స్వీకరించారు. 14 అర్జీలు రాగా కుటుంబ కలహాలు, అత్తింటి వేధింపు లు, ఆస్తి తగాదాలు వంటి సివిల్ వివాదాలు, సైబర్, ఆన్‌లైన్ మోసాలు, అధిక వడ్డీల వేధింపులు, ప్రేమ పేరుతో మోసం వంటి అంశాలపై అర్జీలు ఉన్నాయి. భీమవరం డీఎస్పీ రఘువీర్‌విష్ణు, మహిళా స్టేషన్ డీఎస్పీ యు.రవిచంద్ర, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ కేవీవీఎన్ సత్యనారాయణ పాల్గొన్నారు.
దొమ్మేటికి నివాళులు
సామాజిక సంస్కర్త, శెట్టిబలిజ పితామహుడు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలను జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించారు. దొమ్మేటి చిత్రపటానికి ఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించారు.


