ఏలూరు టౌన్: ఏలూరు నియోజకవర్గంలోనూ రెడ్‌బుక్ అమలు చేస్తామనీ, వైఎస్సార్‌సీపీ నేతలను బెదిరిస్తూ, అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ సోషల్‌మీడియాలో టీడీపీ నేతలు పోస్టులు పెడుతూ రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని, చర్య లు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతలు సో మవారం జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావుకు వినతిపత్రం సమర్పించారు. ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్ గురునాథ్, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్‌బాబు, నేతలు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ఏలూరు నగర ప్రముఖులు అనే సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపులో టీడీపీకి చెందిన ఓ వ్యక్తి అసభ్యంగా దూషించడంతో పాటు ఏలూరులో ప్రతి డివిజన్‌కు రెడ్‌బుక్ ఉందంటూ పోస్టులు పెడుతున్నారని వివరించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ రాగానే తామేంటో చూపిస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నా రని తెలిపారు. రాజకీయ పార్టీల పేరుతో వైషమ్యా లు, గొడవలు సృష్టించేలా చూస్తున్న వారిపై చర్య లు తీసుకోవాలని కోరారు. ఏలూరు నగర మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, కార్పొరేటర్ కేదారేశ్వరి, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు ఇనప నూరి జగదీష్, లీగల్ సెల్ నగర అధ్యక్షుడు ప్ర త్తిపాటి తంబి, న్యాయవాది డి.రామాంజనేయులు, జిల్లా మహిళ ఉపాధ్యక్షురాలు చిలకపాటి డింపుల్, పార్టీ ముఖ్యనేతలు రావి సునీత, రావి నాని, ఆర్‌టీఐ జిల్లా అధ్యక్షుడు స్టాన్లీబాబు, యువజన నాయకుడు ప్రత్తిపాటి విక్టర్, సోషల్‌మీడియా జిల్లా ఉపాధ్యక్షులు బండ్లమూడి సునీల్, గణేష్ ఉన్నారు.
ఏఎస్పీకి వైఎస్సార్‌సీపీ నేతల ఫిర్యాదు


