కై కలూరు: రాష్ట్రంలో సంచలనం కలిగించిన ముదినేపల్లి పసిపిల్లల విక్రయాల కేసులో ఆరుగురిని కోర్టు ముందు హాజరుపర్చామని కై కలూరు రూరల్ సీఐ వి.రవికుమార్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 13న కేసు కట్టి, విచారణలో 9 మందిపై కేసు నమోదు చేశామన్నారు. వీరిలో ఇప్పటివరకు అబ్బిశెట్టి వీరమ్మ, చిట్టూరి చిన్ని, రెడ్డమ్మ, వలవల గోపి, నర్సు మాధురి, ఖలిక్‌ను అరెస్టు చేసి కై కలూరు కోర్టుకు పంపించామన్నారు. విజయవాడకు చెందిన ఫరీనాపై ఇప్పటికే పలు స్టేషన్లలో ఐదు కేసులు ఉన్నాయని, ఆమె రాజమండ్రి జైలులో ఉందన్నారు. పీటీ వారెంట్‌తో ఆమె నుంచి మరింత సమాచారం రాబడతామన్నారు. ముదినేపల్లి మండలం అన్నవరంలో దూలం రాంప్రసాద్, సునీత దంపతులు అబ్బిశెట్టి వీరమ్మ, గోపి, చిన్ని, రెడ్డమ్మల సాయంతో ఫరీనా నుంచి పాపను రూ.3 లక్షలకు కొనుగోలు చేశారన్నారు. మండవల్లి మండలం కానుకొల్లులో ఒకరికి ఏలూరు జనన హాస్పటల్ నర్సు మాధురి ద్వారా రూ.80 వేలు చెల్లించి బాబును తీసుకున్నారన్నారు. ఇక్కడ కూడా వీరమ్మ ఉందన్నారు. వీరమ్మ 2012లో తామరకొల్లులో అనారోగ్యంతో ఉన్న ఒక పాపను, అలాగే వీరమ్మ బంధువుల్లో నలుగురు ఆడపిల్లలు ఉండగా వీరిలో ఇద్దరిని వారి బంధువులకు ఇప్పించిందన్నారు. ఫరీనా నుంచి అన్నవరం దంపతులు పొందిన పాప తల్లిదండ్రులు విషయాలు ఒక్కటే తెలియాల్సి ఉందన్నారు. ఈ కేసులో మరింత మందిని విచారిస్తామని సీఐ చెప్పారు. ముదినేపల్లి ఎస్సై వీరబధ్రరావు పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్ పరీక్షల జవాబుపత్రాల మూ ల్యాంకనం బుధవారం నుంచి ప్రారంభించనున్నట్టు ఇంటర్ బో ర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఏలూ కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మూ ల్యాంకనం జరుగుతుందని, జిల్లాలోని బోటనీ, జువాలజీ, కా మర్స్, ఫిజిక్స్, సివిక్స్, కెమిస్ట్రీ ఎగ్జామినర్లను కళాశాలల ప్రిన్సిపా ల్ రిలీవ్ చేయాలని ఆదేశించారు. చీఫ్ ఎగ్జామినర్స్, ఎగ్జామినర్స్ అదేరోజు ఉదయం 10 గంటలకు, స్క్రూటినైజర్లు 26న ఉదయం 10 గంటలకు రిపోర్ట్ చేయాలని ఆదేశించామన్నారు.


