అగ్గి రాజుకుంటే బుగ్గే | - | Sakshi
Sakshi News home page

అగ్గి రాజుకుంటే బుగ్గే

Mar 21 2026 4:46 AM | Updated on Mar 21 2026 4:46 AM

నడిరోడ్డుపై పడిగాపులు

న్యూస్‌రీల్‌

జిల్లాలో ఫైర్‌స్టేషన్లు

డేంజర్‌ బెల్స్‌లా బహుళ అంతస్తులు

నడిరోడ్డుపై పడిగాపులు
కాలం చెల్లిన బస్సులతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఆర్టీసీ బస్సులు ఎక్కడపడితే అక్కడ ఆగిపోవడంతో ఇక్కట్లు తప్పడం లేదు. 8లో u

శనివారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2026

తణుకు అర్బన్‌: వేసవి ఎండలు తీవ్రమవుతుండటంతో అగ్నిప్రమాదాల భయం వెంటాడుతోంది. జిల్లాలో ఈ ఏడాదిలో 402 అగ్నిప్రమాదాలు జరగ్గా ఎన్నడూ లేనివిధంగా రూ.17.95 కోట్ల ఆస్తి నష్టం సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాదిలో ఎండలు తీవ్రంగా ఉంటాయనే అంచనాలతో ప్రజలు మరింత భయపడుతున్నారు. అధిక శాతం ప్రమాదాల్లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణాలు ఉంటుండగా.. గ్యాస్‌ లీకేజీలు, గడ్డిమేట్లు, పొలాల్లోని గడ్డి దుబ్బులకు నిప్పు పెట్టడం, బహిరంగ ప్రదేశాల్లో మానవ తప్పిదాలతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాలో ఏడు అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో పట్టణం, గ్రామాల నిడివి ఎక్కువగా ఉండడం, అధిక ప్రాంతంగా విస్తరించడం వంటి కారణాలతో ఫైర్‌స్టేషన్లను పెంచడం లేదా కేంద్రానికి రెండో వాహనం మంజూరు చేయాలనే డిమాండ్‌ చాలా కాలంగా వినిపిస్తోంది. నిడివి ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వాహనం చేరుకునే సమయానికే జరగాల్సిన నష్టం జరిగిపోతుందని బాధితులు వాపోతున్నారు.

భయపెడుతున్న ప్రమాదాలు

జిల్లాలో గతంలో లేనిమాదిరిగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు 402 అగ్ని ప్రమాదాలకు సంబంధించి రూ. 17,95,45,500 మేర ఆస్తి నష్టం జరిగింది. అలాగే అగ్నిమాపక సిబ్బంది రూ.119,76,18,000 విలువ చేసే ఆస్తిని కాపాడగలిగారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే అగ్నిమాపక శాఖ అధికారులు తమ పరిధిలోని పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రులు, పరిశ్రమలకు వెళ్లి అగ్నిప్రమాదాలపై అవగాహన కలిగిస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ప్రమాదాల్లో చిక్కుకున్న వారిని ఎలా రక్షించాలనే విషయాలను వివరిస్తున్నారు.

సమస్యల లోగిళ్లుగా..

అగ్నిమాపక కేంద్రాల్లో సిబ్బంది కొరత సమస్యాత్మకంగా ఉంది. సిబ్బంది పదోన్నతులు, ఉద్యోగ విరమణల తరువాత ఆయా పోస్టుల భర్తీలు లేకుండా పోయాయి. 2020 తర్వాత ఇప్పటివరకు అగ్నిమాపక శాఖలో పోస్టుల రిక్రూట్‌మెంట్‌లు లేని దుస్థితి. దీంతో విధుల్లో ఉన్న కొద్దిమంది సిబ్బందిపై విపరీతమైన పని ఒత్తిడి పడి ఇబ్బంది పడుతున్నారు. భీమవరం, నరసాపురం ఫైర్‌స్టేషన్లు శిధిలావస్థకు చేరడంతో ఈ రెండు ప్రాంతాల్లోనూ కొత్త భవనాల నిర్మాణాలు చేయాల్సి ఉంది.

భయపెడుతున్న అగ్ని ప్రమాదాలు

ఈ ఏడాది ఎండల తీవ్రత అధికమంటూ అంచనా

ఆందోళనకరంగా భవన నిర్మాణాలు

అగ్నిమాపక కేంద్రాలను వేధిస్తున్న సిబ్బంది కొరత

వేట్లపాలెం ఘటనతో జిల్లా యంత్రాంగం అప్రమత్తం

ప్రాంతం ఫోన్‌ నంబర్‌

భీమవరం 08816–233299

పాలకొల్లు 08814–222299

తణుకు 08819–222101

తాడేపల్లిగూడెం 08818–221299

నరసాపురం 08814–275399

ఆకివీడు 08816–252099

అత్తిలి 08819–257977

వేట్లపాలెం ఘటనతో అప్రమత్తం

తూర్పుగోదావరి జిల్లా వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఘటనలో 23 మంది మృత్యువాతపడటాన్ని అగ్నిమాపక విభాగం జీర్ణించుకోలేకపోయింది. ఈ ఘటనతో జిల్లా అగ్నిమాపక యంత్రాంగం వెంటనే బాణసంచా దుకాణాల తయారీ కేంద్రాలను పర్యవేక్షించి హెచ్చరించడంతోపాటు పరిశ్రమల యాజమాన్యాలకు కూడా ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలంటూ అవగాహన కల్పించింది.

జిల్లాలో బహుళ అంతస్తుల భవనాలు, పెద్ద హాస్పిటల్స్‌ నిర్మాణాలు డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్నాయి. 100 గజాల్లో కూడా ఐదు అంతస్తుల భవనాలు, ప్రహరీ నుంచి ప్రహరీకి ఆనుకుని నిర్మాణాలు జరిగిపోయి ప్రమాదాలకు నిలయాలుగా కనిపిస్తున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగితే లోపలకు అగ్నిమాపక వాహనం కూడా వెళ్లలేని స్థితిలో భవనాల నిర్మాణాలు ఉంటున్నాయి. సిఫార్సులు, అధికారులను మేనేజ్‌ చేసుకుని జరుగుతున్న ఈ తరహా నిర్మాణాలు ప్రమాదాలకు సంకేతాలిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement