100లోపు 5, వెయ్యిలోపు 30 మందికి ర్యాంకులు
నూజివీడు: గేట్–2026 ఫలితాల్లో నూజివీడు ట్రి పుల్‌ఐటీ విద్యార్థులు ప్రతిభ చూపారు. ఆలిండి యా స్థాయిలో 100లోపు ఐదుగురు విద్యార్థులు ర్యాంకులు సాధించారు. రవణం సురేష్ (ఈసీఈ) 37, మనోజ్ (సీఎస్‌ఈ) 43, తిలక్ 54, నాగరాజు 66, అజయ్ 69వ ర్యాంకు సాధించారు. అలాగే సుదర్శనరెడ్డి (ఈసీఈ)లో 117వ ర్యాంకు సాధించారు. మొత్తంగా వెయ్యి లోపు 30 మంది వి ద్యార్థులు ర్యాంకులు సాధించారు. ర్యాంకుల సాధనలో క్యాంపస్‌లో అమలు చేస్తున్న యూనివర్సిటీ సపోర్ట్ ప్రోగ్రామ్ కీలక పాత్ర పోషించింది. అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ట్రిపుల్ ఐటీ నూజివీడు డైరెక్టర్ ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు అభినందించారు. మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థులను రిజిస్ట్రార్ అభినందించారు.


