తణుకు అర్బన్: గ్యాస్ లీకై వృద్ధురాలు గాయపడిన ఘటన బుధవారం మండపాక శివారు ఎర్రనీలికుంట గ్రామంలో చోటుచేసుకుంది. ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్న గుబ్బల కస్తూరి తన నివాసంలో వంట చేసుకుంటుండగా ప్రమాదవశాత్తూ గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో తణుకు అగ్నిమాపక కేంద్ర అధికారి ఐ.అజయ్‌కుమార్ తమ సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో వృద్ధురాలి కాళ్లకు స్వల్పగాయాలుకాగా చికిత్స నిమిత్తం ఆమెను తణుకు ఆస్పత్రికి తరలించారు. ఇంట్లో సామాగ్రి కొంతమేర మంటల్లో కాలినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.


