విద్యుత్‌ స్తంభాల క్రమబద్ధీకరణ | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ స్తంభాల క్రమబద్ధీకరణ

Mar 18 2026 7:33 AM | Updated on Mar 18 2026 7:33 AM

విద్యుత్‌ స్తంభాల క్రమబద్ధీకరణ పశ్చిమగోదావరి డీఆర్‌ఓగా కె.పద్మలత

కొయ్యలగూడెం: మండలంలోని కన్నాపురం రోడ్డులో తంగళ్ళగూడెం వద్ద ప్రమాదకరంగా ఉన్న విద్యుత్‌ స్తంభాలను అధికారులు క్రమబద్ధీకరించారు. సాక్షి పత్రికలో ఈ నెల 11న ప్రచురితమైన ప్రమాదకరంగా విద్యుత్‌ స్తంభాలు కథనానికి స్పందించి సిబ్బందితో వెళ్లి రెండు చోట్ల ఉన్న స్తంభాలను సరి చేశామని రామారావు తెలిపారు. మెయిన్‌ రోడ్‌ లో ఒకటి ఓ రైతు వ్యవసాయ క్షేత్రంలో మరొకటి రెండు రోజులపాటు శ్రమించి క్రమబద్ధీకరించామని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు అదే విధంగా ప్రయాణికులు విద్యుత్‌ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): జిల్లా డిఆర్‌ఓగా కే.పద్మలతను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డీఆర్‌ఓగా పనిచేస్తున్న పద్మలతను బదిలీపై పశ్చిమగోదావరి జిల్లాకు డీఆర్‌ఓగా నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement