అమరజీవికి ఘన నివాళి | - | Sakshi
Sakshi News home page

అమరజీవికి ఘన నివాళి

Mar 17 2026 7:19 AM | Updated on Mar 17 2026 7:19 AM

అమరజీవికి ఘన నివాళి తొలిరోజు 98.42 శాతం హాజరు తాడేపల్లిగూడెంలో మరో కోర్టు నిరాటంకంగా గ్యాస్‌ సరఫరా

భీమవరం (ప్రకాశంచౌక్‌): అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజల గౌరవం, స్వాభిమానానికి ప్రతీకగా నిలిచిన మహనీయులని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరజీవి గొప్పత నాన్ని కలెక్టర్‌ గుర్తుచేశారు. అలాగే కలెక్టరేట్‌ ఆవరణలోని అమరజీవి విగ్రహానికి జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి, జిల్లా అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ప్రశాంతంగా టెన్త్‌ పరీక్షలు

భీమవరం: జిల్లాలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. స్థానిక పొట్టిశ్రీరాములు మున్సిపల్‌ బాలికల పాఠశాలలో కేంద్రాన్ని కేంద్రాన్ని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్షల నిర్వహణను పరిశీలించారు. పరీక్షలకు పక్కా ఏర్పాట్లు చేసినట్టు ఆమె చెప్పారు. విద్యార్థులు ఎటువంటి ఆందోళనకు గురికాకుండా పరీక్షలు రాయాలన్నారు. డీఈఓ ఈ.నారాయణ ఉన్నారు.

132 కేంద్రాల్లో.. జిల్లాలోని 132 కేంద్రాల్లో తొలిరోజు తెలుగు పరీక్షకు 98.42 శాతం విద్యార్థులు హాజరయ్యారని డీఈఓ నారాయణ ప్రకటనలో తెలిపారు. 23,415 మందికి 23,044 మంది హాజరయ్యారన్నారు. అలాగే ఎస్‌ఎస్‌సీ (అసోస్‌) పరీక్షకు 240 మందికి 201 మంది హాజరయ్యారని, ఎక్కడా మాల్‌ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాలేదని తెలిపారు.

తాడేపల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడేనికి మూడో అదనపు సివిల్‌ జడ్జి జూనియర్‌ డివి జన్‌ కోర్టు మంజూరైనట్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శిరిగినీడి విజయకృష్ణ తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన బార్‌ హాల్‌లో సోమ వారం న్యాయవాదుల సమావేశం నిర్వహించా రు. మాజీ జిల్లా జడ్జి గౌతమ్‌ ప్రసాద్‌ పంపిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చరిత్ర గ్రంధాలను శిరిగినీడి ఆవిష్కరించారు. సీనియర్‌ మహిళా న్యాయవాది నిట్టల సూర్యమణి ఆమె తల్లి జ్ఞాపకార్థం అసోసియేషన్‌కు వీల్‌చైర్‌ అందజేశారు. జనరల్‌ సెక్రటరీ పెదగాడి భూపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): జిల్లాలో గృహావసరాల కోసం వంట గ్యాస్‌ సరఫరా ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతోందని జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. జిల్లాలోని 49 ఏజెన్సీల ద్వారా రోజుకు సుమారు 12 వేల సిలిండర్లు సరఫరా చేస్తున్నామన్నారు. గ్యాస్‌ సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌లో 81216 76653 టోల్‌ ఫ్రీ నంబర్‌తో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటుచేశామన్నారు. అలాగే ఆస్పత్రులు, ప్రభుత్వ హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, విద్యాసంస్థలకు గ్యాస్‌ సరఫరా నిరంతరంగా కొనసాగుతోందని జేసీ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement