పరీక్షకు ముందు రోజు కలిసిన అన్నదమ్ములు | - | Sakshi
Sakshi News home page

పరీక్షకు ముందు రోజు కలిసిన అన్నదమ్ములు

Mar 17 2026 7:19 AM | Updated on Mar 17 2026 7:19 AM

పరీక్షకు ముందు రోజు కలిసిన అన్నదమ్ములు

పాలకొల్లు సెంట్రల్‌: ‘మా తమ్ముడిని.. నన్నూ కలపండి’ శీర్షిన ఈనెల 5న ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన బాలలు మర్రి కోటి శ్రీహర్ష, విశ్వాంత్‌ పాలకొల్లులో మేనమామ కొమిరిశెట్టి నరేష్‌ ఇంటి వద్ద ఉంటుండగా.. పిల్లల చిన్నాన్న రఘునాథ్‌ వారిని వినుకొండ తీసుకువెళ్లి నిర్బంధించగా నరేష్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించి శ్రీహర్షను పాలకొల్లు పంపించేలా చర్య లు తీసుకున్నారు. అయితే విశ్వాంత్‌ను అక్కడే బంధించడంతో తమ్ముడిపై బెంగతో శ్రీహర్ష పరీక్షలకు సిద్ధం కాలేకపోయాడు. దీనిపై ‘సాక్షి’ కథనాన్ని ప్ర చురించగా చైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారులు స్పందించారు. వినుకొండలో ఉన్న పిల్లల చిన్నాన్నను పిలిచి విచారించారు. విశ్వాంత్‌ను వెంటనే పాలకొల్లు పంపించాలని ఆదేశించారు. దీంతో మేనమామ నరేష్‌ ఆదివారం వినుకొండ వెళ్లి విశ్వాంత్‌ను ఇంటికి తీసుకువచ్చారు. పదో తరగతి పరీక్షలకు ఒక్కరోజు ముందు తమ్ముడు తన వద్దకు రావడంతో శ్రీహర్ష ఆనందంతో పొంగిపోయాడు. అధికారులకు, ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement