భీమవరం(ప్రకాశం చౌక్): పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ అర్జీలను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం జిల్లాస్థాయి పీజీఆర్‌ఎస్‌లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పీజీఆర్‌ఎస్‌లో 141, రెవెన్యూ క్లినిక్‌లో 26 అర్జీలు స్వీకరించారు. జేసీ టి.రాహూల్‌కుమార్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
అర్జీల్లో కొన్ని..
● పెనుమంట్రలో గోస్తని నదిని ఆనుకుని ఉన్న శ్మశాన వాటిక వర్షాకాలంలో ముంపునకు గురవుతోందని, చర్యలు తీసుకోవాలని బీసీ–డీ కులస్తులు వినతిపత్రం అందించారు.
● తమ గ్రామంలో పొలాలకు నీరందించే పంచాయతీ చెరువును లీజుకు ఇచ్చేయడంతో సాగునీటి ఇబ్బందులు తలెత్తాయని, ఇప్పటికీ ఐదుసార్లు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసినా పరిష్కారం లభించలేదని మొగల్తూరు మండలం రామన్నపాలేనికి చెందిన దాసరి గోపాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. చొక్కాకు చంద్రబాబు హమీ, పీజీఆర్‌ఎస్‌కు సమస్య మళ్లీ రా కూడదని చంద్రబాబు చెప్పిన పేపర్ క్లిప్‌ంగ్‌తో ఆయన కలెక్టరేట్‌కు వచ్చారు.


