న్యూస్‌రీల్
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా సాయం
తొలి ఏడాది ఎగనామం
రెండేళ్లుగా మోసం చేస్తున్నారు
శనివారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2026
సాక్షి, భీమవరం: వ్యవసాయానికి పెద్దపీట వేస్తా మంటూ ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు ఊదరగొట్టారు. రైతులను అన్నివిధాలా ఆదుకుంటామన్నారు. అన్నదాత సుఖీభవ ద్వారా సాగుదారులందరికీ రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పి తొలి ఏడాది సాయానికి ఎగనామం పెట్టారు. తర్వాత సీజన్ నుంచి లబ్ధిదారుల జాబితాకు కోత పెట్టి రైతుల నడ్డివిరిచారు. మూడో విడతలోనైనా తమకు న్యాయం జరుగుతుందన్న రైతులు, కౌలు రైతుల ఆశలపై చంద్రబాబు ప్రభుత్వం నీళ్లు చల్లింది.
2.20 లక్షల ఎకరాలు.. 1.25 లక్షల మంది రైతులు
జిల్లాలోని 2.20 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది. పంట పెట్టుబడులు కోసం రైతులు ఇబ్బంది పడకుండా గత ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద అసలు రైతులతో పాటు కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందించేవారు. కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ రూ.6,000కు, రూ.7,500 జతచేసి ఏటా రూ. 13,500 మొత్తాన్ని ఖరీఫ్ ప్రారంభం, కోతలు, రబీ ప్రారంభంలోను మూడు విడతలుగా జిల్లాలోని 1.25 లక్షల మంది రైతులకు ప్రభుత్వ సాయం అందేది.
లబ్ధిదారులకు కోత : 2023–24కి గాను గత ప్రభుత్వంలో జిల్లాలో 1,24,645 మంది సాయం అందించారు. కాగా లబ్ధిదారుల సంఖ్యకు కూటమి ప్రభుత్వం కోత పెట్టింది. ఈ సీజన్‌లో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి జిల్లాలో 1,03,761 మంది మాత్రమే అర్హులుగా ప్రకటించింది. ఈ మేరకు 20 వేల మంది పైచిలుకు రైతులు నష్టపోతున్నారు. ఎన్నికల హామీ మేరకు కేంద్ర సాయంతో కలిపి రూ.26 వేలు అందజేయాల్సి ఉండగా రూ.20 వేలు ఇస్తున్నారు. గత రెండు విడతల్లో రూ.7 వేల చొప్పున రూ.14 వేలు అందజేయగా మూడో విడ తగా శుక్రవారం మిగిలిన రూ.6 వేలు అందజేశారు. మూడో విడతలోనైనా తమకు పెట్టుబడి సాయం అందుతుందని ఎదురుచూసిన రైతులకు ఈసారీ నిరాశే ఎదురైంది.
కౌలు రైతులకు వంచన
సాగులో నష్టం వస్తే మొదటిగా కుదేలయ్యేది కౌలు రైతులే. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టడం, అసలు రైతుకు మగతా పోనూ వారికి మిగిలేది అంతంతమాత్రమే. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ సాయం, ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తామంటూ చెప్పుకొచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అన్నదాత సుఖీభవ పథకం పోర్టల్‌లో కౌలు రైతులు దరఖాస్తు చేసుకునే ఆప్షన్ లేకుండా చేయడం గమనార్హం. రెండో విడత నుంచి కౌలు రైతులకు సాయం విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు గతంలో ప్రకటించినా మూడో విడతలో సైతం సాయం అందించలేదు. తమకు అన్నదాత సుఖీభవ వర్తింపజే యాలని ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని కౌలు రైతులు మండిపడుతున్నారు.
సంవత్సరం రైతులు సాయం
రూ.కోట్లలో
2019–20 1,09,302 147.56
2020–21 1,24,664 168.30
2021–22 1,17,791 159.02
2022–23 1,13,597 153.36
2023–24 1,24,645 168.17
తాము అధికారంలోకి రాగానే ఏటా పీఎం కిసాన్‌తో సంబంధం లేకుండా రూ.20 వేలు పెట్టుబ డి సాయం ఇస్తామంటూ కూటమి నేతలు చెప్పుకొచ్చారు. 2024– 25 వ్యవసాయ సీజన్‌కు పెట్టుబడి సాయం అందించుకుండా చంద్రబాబు ప్ర భుత్వం రైతులను నిలువునా ముంచింది. ఒక్కో రైతు రూ.20 వేల చొప్పున జిల్లాలోని రైతులు రూ.249 కోట్లు నష్టపోయారు.
రైతన్నకు దగా
తొలి ఏడాదికి అన్నదాత సుఖీభవ సాయానికి ఎగనామం
లబ్ధిదారులను కుదించి జిల్లాలో 1.03 లక్షల మందికి మాత్రమే సాయం
కౌలు రైతులకు మొండిచేయి
వైఎస్సార్‌సీపీ హయాంలో 1.25 లక్షల మందికి సాయం
నేను దొడ్డిపట్లలో మూడేళ్ల క్రితం వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. తర్వాత రెండేళ్ల క్రితం ఆన్‌లైన్ చేయించారు. ఇప్పటివరకూ అన్నదాత సుభీభవ డబ్బులు జమకాలేదు. రెండేళ్లుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాను. పొలం ఆన్‌లైన్ అయ్యింది, డబ్బులు పడతాయంటూ మూడు విడతలుగా మోసం చేస్తున్నారు.
– మండెల సూర్యకుమారి, మేడపాడు


