ఉత్సాహంగా.. ఉల్కాన్‌జీ | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా.. ఉల్కాన్‌జీ

Mar 14 2026 7:19 AM | Updated on Mar 14 2026 7:19 AM

తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్‌లో శుక్రవారం ఉల్కాన్‌జీ 2కే26 వేడుకలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. నిట్‌ ఇన్‌చార్జి డైరెక్టర్‌ ఎన్‌వీ రమణరావు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. విద్యార్థులు వేసే ప్రతి మెట్టు విజయానికి దారి కావాలని ఆకాంక్షించారు. సాంకేతికతపై పట్టు సాధించాలని, సృజనాత్మకతకు ఎప్పుడూ డిమాండ్‌ ఉంటుందన్నారు. ఏపీ నిట్‌ మంచి స్థానంలో ఉందని మౌలిక వసతు లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. డీన్‌ ఆఫ్‌ స్టూడెంట్‌ వెల్ఫేర్‌ ఆధ్వర్యంలో రెండు రోజుల పా టు జరుగనున్న ఉల్కాన్‌జీ వేడుకల్లో విద్యార్థులు ప్ర దర్శించిన నృత్యాభినయాలు అలరించాయి. డాక్టర్‌ హిమబిందు, డాక్టర్‌ రాజేశ్వర్‌రెడ్డి, డీన్‌లు రవికిరణ్‌ శాస్త్రి, వి.సందీప్‌, ఎన్‌.జయరామ్‌, జీబీ వీరేష్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement