తణుకు అర్బన్: తొలి తెలుగు మహిళా కవయిత్రి మొల్లమాంబ జీవితం స్ఫూర్తిదాయకమని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నా రు. కవయిత్రి మొల్లమాంబ జయంత్రి సందర్భంగా తణుకు వైఎస్సార్ పార్కులో ఉన్న ఆమె విగ్రహానికి శుక్రవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కారుమూరి మాట్లాడుతూ రామాయణాన్ని తెలుగులో రచించిన తెలుగు కవయిత్రి మొల్లమాంబ ఆదర్శనీయురాలన్నారు. తెలుగు కవితా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న మహనీయురాలి విగ్రహాన్ని తణుకు వైఎస్సార్ పార్కులో ఏర్పాటుచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఏపీ కుమ్మర శాలివాహన సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిరుదుకోట చింతన్న మాట్లాడుతూ కుమ్మర శాలివాహనుల ఆరాధ్యురాలు మొల్ల జీవితం ఆదర్శనీయమన్నారు. పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి పొట్ల సురేష్, జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ యిండుగపల్లి బలరామకృష్ణ, పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు జల్లూరి జగదీష్, నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షుడు సబ్బితి రాజేష్, నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జిలానీ, యారబాటి రామకృష్ణ, పైబోయిన ఏసుబాబు, నల్లూరి చంద్రశేఖర్, పైడి సాయిసూర్య, నార్గన శేఖర్ పాల్గొన్నారు.


