నేడు జాతీయ లోక్‌ అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు జాతీయ లోక్‌ అదాలత్‌

Mar 14 2026 7:19 AM | Updated on Mar 14 2026 7:19 AM

ఏలూరు (టూటౌన్‌): ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శనివారం జరిగే జాతీయ లోక్‌అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.శ్రీదేవి కోరారు. శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి చాంబర్‌లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈ ఏడాదిలో తొలి జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నామని, రాజీయోగ్యమైన కేసులను రాజీ చేస్తామన్నారు. గత డిసెంబర్‌లో జరిగిన లోక్‌ అదాలత్‌లో 10,798 కేసులను రాజీ చేశామని చెప్పారు. ఈ లోక్‌ అదాలత్‌లో 9,345 కేసులు రాజీయోగ్యమైనవి గుర్తించామన్నారు. కక్షిదారులు సౌకర్యార్థం హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశామని, కేసుల పరిష్కారంలో సందేహా లు ఉంటే 08812 2245 నంబర్‌లో సంప్రదించా లని సూచించారు. ఏలూరు బార్‌ అసోసియేషన్‌ ప్రె సిడెంట్‌ కోనే సీతారాం, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement