కొల్లేరు తాబేళ్ల అక్రమ రవాణా | - | Sakshi
Sakshi News home page

కొల్లేరు తాబేళ్ల అక్రమ రవాణా

Feb 4 2026 8:30 AM | Updated on Feb 4 2026 8:30 AM

కొల్ల

కొల్లేరు తాబేళ్ల అక్రమ రవాణా

కొల్లేరు తాబేళ్ల అక్రమ రవాణా

తాబేళ్ల రవాణా పెద్ద నేరం

కై కలూరు: కొల్లేరు తాబేళ్లు.. స్మగ్లర్లుకు రూ.కోట్ల అదాయ వనరుగా మారాయి. కొల్లేరు ప్రాంతంలో సేకరించిన తాబేళ్లను ఒడిశాకు అక్రమ రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. చెక్‌పోస్టుల వద్ద అధికారులు తూతూమంత్రంగా దాడులు నిర్వహిస్తుండడంతో తాబేళ్ల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. సాధారణంగా తాబేళ్లు పంట బోదెలు, కాలువలు, డ్రెయిన్లలో లభిస్తాయి. కొల్లేరు ప్రాంతంలో ఆక్వా చెరువుల్లో ప్రవేశించడంతో ఇక్కడ ఎక్కువ సంఖ్యలో జీవిస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఆక్వా హబ్‌గా పేరుగడించిన కై కలూరు నియోజకవర్గంలో 84,734 ఎకరాల్లో చేపలు, రొయ్యల సాగు చేస్తున్నారు. ఇక్కడ ఆక్వా చెరువుల పట్టుబడుల సమయంలో తాబేళ్లు సేకరణ వలల మేసీ్త్రల ద్వారా జరుగుతోంది. ఆక్వా రైతులు సైతం ఇవి ఉపయోగం లేవని వలల రైతులను తీసుకువెళ్లమంటున్నారు.

తాబేళ్ల సేకరణ ఇలా..

ఒడిశాకు చెందిన కుమార్‌ అనే వ్యక్తి కై కలూరు ప్రాంతంలో కొందరు యువకులతో కలసి తాబేళ్లను అక్రమ రవాణా చేశాడు. ఏపీ, ఒడిశాలో అతనిపై పలు కేసులు నమోదయ్యాయి. దీంతో ఒడిశాకు కొన్ని సంవత్సరాల క్రితం మకం మార్చాడు. అతని శిష్యులు స్మగ్లింగ్‌ వ్యాపారాన్ని ఇక్కడ కొనసాగిస్తున్నారు. ఇందులో కొరుకొల్లు గ్రామ సమీప బొబ్బిలిగూడెంకు చెందిన ఓ వ్యక్తి కీలకసూత్రధారిగా ఉన్నాడు. ఇతని ఆదేశాలతో కై కలూరు మండలం ఆలపాడు, వింజరం, శీతనపల్లి, దొడ్డిపట్ల, వేమవరప్పాడు, రామవరం, కలిదిండి మండలం, వెంకటాపురం, గొల్లగూడెం, సానారుద్రవరం, కోరుకొల్లు, బొబ్బిలిగూడెం, ఆరుతెగలపాడు, చింతలమోరు, మండవల్లి మండలం, చింతపాడు, కొవ్వాడలంక, పులపర్రు, దెయ్యంపాడు, ముదినేపల్లి మండలంలో వడాలి, బొమ్మినంపాడు గ్రామాల్లో తాబేళ్లను సేకరిస్తున్నారు. మరికొన్ని డ్రెయిన్లలో సేకరించిన వారి నుంచి కొనుగోలు చేస్తున్నారు. అక్కడక్కడ గోనెసంచులలో వీటిని ఉంచి రాత్రి వేళల్లో వ్యాన్‌లో లోడింగ్‌ చేసి పంపుతున్నారు.

రాష్ట్ర సరిహద్దులు దాటించేది ఇలా..

కై కలూరు కొల్లేరు ప్రాంతాల్లో సేకరించిన తాబేళ్లను సైజుల బట్టి ఇక్కడ రూ.30 నుంచి రూ.60కి కొనుగోలు చేస్తున్నారు. ఒడిశా మార్కెట్‌లో వీటిని రూ.400 నుంచి రూ.500కు విక్రయిస్తున్నారు. వారానికి రెండు వాహనాలు కలిదిండి మండలం కోరుకొల్లు, కాళ్ల, భీమవరం, రాజోలు మీదుగా ఒడిశా చేరుతున్నాయి. ఎవరికీ అనుమానం రాకుండా వాహనంలో అడుగున గురకలు ఉంచి మధ్యలో తాబేళ్లను పేర్చి తిరిగి పైన గురకలు వేసి సంచులతో కడుతున్నారు. అనేక చెక్‌పోస్టులు దాటి ఒడిశాకు తాబేళ్లు ఎలా చేరుతున్నాయనేది లక్ష డాలర్ల ప్రశ్నగా మారింది. కొద్ది రోజుల క్రితం రామవరం దొడ్డిపట్ల ప్రాంతాల్లో రోడ్డు పక్కన సంచుల్లో తాబేళ్లను కొందరూ గుర్తించారు.

ఒడిశాకు తరలిస్తున్న స్మగ్లర్లు

చేపలు, రొయ్యల చెరువుల పట్టుబడుల సమయంలో తాబేళ్ల సేకరణ

వారానికి రెండు వ్యాన్లలో రాష్ట్ర సరిహద్దులు దాటుతున్న వైనం

అక్రమ రవాణాను అడ్డుకోలేని అధికారులు

చెక్‌పోస్టుల వద్ద తూతూమంత్రంగా దాడులు

అంతరిస్తున్న తాబేళ్లు షెడ్యూల్‌ 1 జాబితాలో చేర్పు

తాబేళ్లు ఉభయజలచరాలు. ప్రకృతితో అత్యంత ప్రాధాన్యత కలిగిన వీటిని షెడ్యూల్‌ 1లో చేర్చారు. వీటి రవాణా నేరం. టోరిటోరియల్‌ అధికారులకు సమాచారం అందించాలి. అటవీశాఖ సిబ్బందిని తాబేళ్లు అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఆదేశాలిచ్చాం. త్వరలో స్మగ్లర్లను అదుపులోకి తీసుకుంటాం.

– కేపీ.రామలింగాచార్యులు, కై కలూరు ఫారెస్ట్‌ రేంజర్‌

కొల్లేరు తాబేళ్ల అక్రమ రవాణా 1
1/1

కొల్లేరు తాబేళ్ల అక్రమ రవాణా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement