వివాహితపై యువకుడి దాడి
ఇంటర్ పరీక్షలకు 5,923 మంది హాజరు
ఉంగుటూరు బి–బ్లాకు అటవీ ప్రాంతంలో ఓ యువకుడు వివాహిత శరీరంలోని ప్రైవేట్ పార్టులను కాల్చేసి హింసించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 8లో u
లింగపాలెం: ధర్మాజీగూడెంలో వీధుల్లో పేరుకుపోయిన చెత్తను పారిశుద్ధ్య కార్మికులు మంగళవారం తొలగించారు. గ్రామంలో చెత్త ఎక్కడిక్కడ పేరుకుపోవడంపై ‘చెత్తపై నిర్లక్ష్యం.. వ్యాధులు సోకే ప్రమాదం’ శీర్షికన సాక్షి కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన ధర్మాజీగూడెం గ్రామ పంచాయతీ అధికారులు మంగళవారం పారిశుద్ధ్య కార్మికులచే వీధుల్లో ఉన్న చెత్తకుప్పలను తొలగించారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా మంగళవారం జిల్లాలోని 53 కేంద్రాల్లో నిర్వహించిన ప్రయోగ పరీక్షలకు 5,923 మంది విద్యార్థులు హాజరయ్యారు. జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు జరిగిన ఈ పరీక్షల్లో ఉదయం 136 మంది, మధ్యాహ్నం 78 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల్లో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కే యోహాను ఒక ప్రకటనలో తెలిపారు.
వివాహితపై యువకుడి దాడి


