శివారాత్రి ఉత్సవ ఏర్పాట్లపై సమీక్ష
పోలవరం రూరల్: పట్టిసం మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్ధం చేసే ఏర్పాట్లు అధికారులు సమన్వయంతో పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్ తెలిపారు. పోలవరం మండలం పట్టిసం శివక్షేత్రం వద్ద రెండవ దఫా సమావేశం మంగళవారం జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవీ రమణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ నెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలకు అధికార యంత్రాంగం పటిష్టమైన పనులు చేపట్టాలన్నారు. శాఖల వారీగా నిర్ధేశించిన పనులు ఎంత వరకు పూర్తయ్యాయనే విషయాలను సంబంధిత అధికారులతో సమీక్షించారు. డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, ఐటీడీఏ పీఓ రాములునాయక్ పాల్గొన్నారు.


