కాకినాడ టౌన్–తిరువన్నామలై మధ్య ప్రత్యేక రైళ్లు
ఏలూరు (టూటౌన్): కాకినాడ టౌన్–తిరువన్నామలై మధ్య ప్రత్యేక రైలు సర్వీసులు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ట్రైన్ నెం.07617 కాకినాడ టౌన్–తిరువన్నామలై మధ్య ఈ నెల 14న, ట్రైన్ నెం.07618 తిరువన్నామలై–కాకినాడ టౌన్ మధ్య ఈనెల 16న నడుస్తుందన్నారు. ఈ రైలు కాకినాడ టౌన్‌లో బయలు దేరి సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరంటౌన్, ఆకివీడు, కై కలూలరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్పాడి, వెల్లూరు స్టేషన్లలో ఆగనుంది.
కాకినాడ టౌన్–హిస్సార్ మధ్య ప్రత్యేక సర్వీసులు
కాకినాడ టౌన్–హిస్సార్ మధ్య 12 ప్రత్యేక రైలు సర్వీసులు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలియజేశారు.ట్రైన్ నెం.07705 కాకినాడ టౌన్–హిస్సార్ మధ్య ఈ నెల 19 నుంచి మార్చి 26 మధ్య ఆరు సర్వీసులు, ట్రైన్ నెం.07706 హిస్సార్–కాకినాడ టౌన్ మధ్య ఈ నెల 22 నుంచి మార్చి 29 మధ్య ఆరు సర్వీసులు నడుస్తాయని స్పష్టం చేశారు.
జంగారెడ్డిగూడెం: వరల్డ్ ట్రాన్స్‌ప్లాంట్ గేమ్స్ మెడలిస్ట్ ఎస్‌ఎన్ నాయుడు మరో విజయం సాధించాఛిజీ. జంగారెడ్డిగూడెం అటవీశాఖ సెక్షన్ అధికారిగా పని చేస్తున్న నాగ వాసు నాయుడు సుంకర ఇటీవల పూణేలో నిర్వహించిన మాస్టర్స్ నేషనల్ గేమ్స్‌లో 5 కిలోమీటర్ల రేస్‌వాక్ పోటీలో రజత పతకం సాధించాడు. ఈ మేరకు ఎస్‌ఎన్ నాయుడును మంగళవారం అటవీశాఖ అధికారులతో పాటు ప్రముఖులు అభినందించారు.


