మహిళా ఉద్యోగులకు భద్రత కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

మహిళా ఉద్యోగులకు భద్రత కల్పించాలి

Feb 4 2026 8:23 AM | Updated on Feb 4 2026 8:23 AM

మహిళా ఉద్యోగులకు భద్రత కల్పించాలి

మహిళా ఉద్యోగులకు భద్రత కల్పించాలి

పాలకొల్లు సెంట్రల్‌: ప్రభుత్వ సేవలో ఉన్న ఉద్యోగులకు ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పాలకొల్లు తాలూకా అధ్యక్షులు సునీల్‌ కుమార్‌ అన్నారు. సోమవారం పట్టణంలో సచివాలయ సెక్రటరీ షకీనాపై జరిగిన దాడికి నిరశనగా మంగళవారం పట్టణ మునిసిపల్‌ కమిషనర్‌ బి.విజయసారథి, తహసీల్దార్‌ యడ్ల దుర్గా కిషోర్‌లకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సునీల్‌ కుమార్‌ మాట్లాడుతూ ఇలాంటి అమానుషమైన సంఘటనలు జరగడం దురదృష్టమన్నారు. ఉద్యోగులకు భద్రత లేకపోతే విధులు నిర్వహించడం చాలా కష్టమన్నారు. నల్లబ్యాడ్జ్‌లతో విధుల్లో పాల్గొని ఉద్యోగులు నిరసన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో నారాయణరాజు, రామకృష్ణ, రాజ్‌కుమార్‌, మోహనరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement