వైఎస్సార్‌ టీఏ రాష్ట్ర అధికార ప్రతినిధిగా గడ్డం సుధీర్‌ | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ టీఏ రాష్ట్ర అధికార ప్రతినిధిగా గడ్డం సుధీర్‌

Feb 4 2026 8:23 AM | Updated on Feb 4 2026 8:23 AM

వైఎస్సార్‌ టీఏ రాష్ట్ర అధికార ప్రతినిధిగా గడ్డం సుధీర్‌

వైఎస్సార్‌ టీఏ రాష్ట్ర అధికార ప్రతినిధిగా గడ్డం సుధీర్‌

వైఎస్సార్‌ టీఏ రాష్ట్ర అధికార ప్రతినిధిగా గడ్డం సుధీర్‌ తనను అనుమానిస్తున్నారని మహిళ ఆత్మహత్య దళిత యువకుల మృతిపై న్యాయ విచారణ జరిపించాలి 18 నుంచి టైలరింగ్‌ పరీక్షలు చర్యలు తీసుకోవాలి

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వైఎస్సార్‌ టీచర్స్‌ అసోసి యేషన్‌ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నగరానికి చెందిన గెడ్డం సుధీర్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ సంఘ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేశవరపు జాలిరెడ్డి, షేక్‌ జంషీద్‌ నియామకపు ఉత్తర్వులిచ్చారు. సుధీర్‌ నియామకం పట్ల సంఘ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీ రామ్మోహనరావు, పీ సాంబశివరావు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. సుధీర్‌ గతంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసి రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో కీలకపాత్ర పోషించారన్నారు. జిల్లాలో సుధీర్‌ నేతృత్వంలో సంఘాన్ని బలోపేతం చేసి ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటాలు నిర్మిస్తామని స్పష్టం చేశారు. మరో ప్రకటనలో వైఎస్సార్‌ టీఏ పోలవరం ఇన్‌చార్జి కందుల ప్రకాష్‌, రాష్ట్ర సహాయ కార్యదర్శి సున్నం శ్రీను గడ్డం సుధీర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ద్వారకాతిరుమల: తోటికోడలు బంగారపు నక్లెస్‌ కనబడని విషయంలో అందరూ తనను అనుమానిస్తున్నారని మనస్తాపానికి గురై, కూల్‌ డ్రింక్‌లో ఎలుకల మందు కలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. దీనిపై స్థానిక పోలీస్టేషన్‌లో మంగళవారం కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం. మండలంలోని తిరుమలంపాలెంకు చెందిన మేడిశెట్టి హేమలత(28) గత నెల 26న మధ్యాహ్నం 3 గంటలకు ఉండ్రాజవరం లోని పుట్టింటికి వెళ్లి, పడిపోయింది. ఏం జరిగిందని హేమలతను ఆమె తల్లి ఆకన మల్లేశ్వరి అడుగగా, తన తోటి కోడలికి చెందిన బంగారపు నక్లెస్‌ కనబడని విషయంలో అందరూ తనను అనుమానిస్తున్నారని చెప్పింది. ఆ మనస్తాపంతో ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయానికి వెళ్లి, గుడి సెంటర్‌లో కూల్‌ డ్రింక్‌లో ఎలుకల మందు కలుపుకుని తాగానని తెలిపింది. దాంతో హేమలతను హుటాహుటీన తొలుత తణుకులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం మంగళగిరిలోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హేమలత సోమవారం ఉదయం మృతి చెందింది. మృతురాలి తల్లి మల్లేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

భీమవరం: పాలకొల్లు, పోడూరు మండలాల్లో దళిత యువకుల మరణంపై ఎన్నో అనుమానాలు ఉన్నందున సిట్టింగ్‌ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందరకుమార్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. పాలకొల్లు మండలం లంకలకోడేరులో వర్ధనపు కిరణ్‌కుమార్‌, పోడూరు మండలం జిన్నూరులో ముప్పర్తి జస్లోన్‌ మృతి పలు అనుమానాలకు దారితీస్తోందన్నారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా దళితులపై దాడులు, దమనకాండ విపరీతంగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో కొండేటి లాజర్‌, పట్టెం శుభాకర్‌, అంబటి ఆనంద్‌కుమార్‌, జీడీ కరుణాకర్‌, పిట్టా వంశీ, శుభాకర్‌ పాల్గొన్నారు.

భీమవరం: టీటీపీ పరీక్షలు ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని జిల్లా విద్యాశాఖాధికారి ఇ నారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 18 నుంచి 21వ తేదీ వరకు డ్రాయింగ్‌ లోయర్‌, హైయర్‌ పరీక్షలు, 18 నుంచి 20వ తేదీ వరకు టైలరింగ్‌, ఎంబ్రాయిడరీ లోయర్‌, హైయర్‌ పరీక్షలు రెండు షిప్ట్‌లలో జరుగుతాయన్నారు. హ్యాండ్లూమ్‌ వీవింగ్‌ పరీక్షలు 19వ తేదీ నుంచి 28 వరకు నిర్వహిస్తామన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యార్థి సంఘాల నాయకులను కిడ్నాప్‌ చేసి భయభ్రాంతులకు గురిచేసిన మోహన్‌బాబు యూనివర్సిటీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో సత్రంపాడు స్ప్రింగ్‌బోర్డు స్కూల్‌ వద్ద ధర్నా నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement