కూటమి కల్తీ కుట్రలపై కన్నెర్ర | - | Sakshi
Sakshi News home page

కూటమి కల్తీ కుట్రలపై కన్నెర్ర

Feb 1 2026 7:28 AM | Updated on Feb 1 2026 7:28 AM

కూటమి

కూటమి కల్తీ కుట్రలపై కన్నెర్ర

బైక్‌లు ఢీకొని ఒకరి మృతి కోపల్లె వంతెన వద్ద ఉద్రిక్తత చంద్రబాబు నాటకం భగ్నమైంది కల్తీ లేదని రుజువైంది మహాపాతకం చేశారు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు సీబీఐ నివేదిక చెంపపెట్టు భక్తులకు క్షమాపణ చెప్పాలి

న్యూస్‌రీల్‌

బైక్‌లు ఢీకొని ఒకరి మృతి
ఆకివీడు మండలం దుంపగడప అడ్డరోడ్డు సమీపంలో శనివారం ఎదురెదురుగా వస్తున్న బైక్‌లు ఢీకొని ఒకరు మృతి చెందగా.. నలుగురు గాయపడ్డారు. 8లో u

జక్కరంలోని ఆర్‌సీఎం చర్చి విద్యుత్‌ స్తంభం తొలగింపుపై క్రైస్తవ సంఘాలు భగ్గుమన్నాయి. శనివారం కోపల్లె వంతెన వద్ద ఆందోళన నిర్వహించారు. 8లో u

ఆదివారం శ్రీ 1 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

సాక్షి, భీమవరం: కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ తిరుమల లడ్డూ ప్రసాదాన్ని చంద్రబాబు స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం పట్ల వైఎస్సార్‌సీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. లడ్డూలో జంతు కొవ్వు కలిసిందంటూ దుష్ప్రచారం చేసిన చంద్రబాబు అండ్‌ కో సీబీఐ నివేదికపై నోరుమెదపరేమని మండిపడ్డారు. కూటమి మహాపచారం వల్ల రాష్ట్రానికి అరిష్టం కలుగకుండా కాపాడమని శనివారం జిల్లా అంతటా వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాప పరిహార పూజలు నిర్వహించారు.

నరసాపురం నియోజకవర్గంలో..

పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్‌లు నరసాపురంలో పార్టీ శ్రేణులతో కలిసి భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌, కూటమి నేతలకు మంచి బుద్ధిని ప్రసాదించమని కోరుతూ పట్టణంలోని రాజగోపాల స్వామి ఆలయంలో పూజలు చేశారు. మున్సిపల్‌ చైర్‌పర్సనన్‌ బర్రే శ్రీవెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

భీమవరం నియోజకవర్గంలో..

నియోజకవర్గ కోఆర్డినేటర్‌ చినమిల్లి వెంకటరాయుడు ఆధ్వర్యంలో భీమవరం రూరల్‌ రాయలం నుంచి భీమవరం జువ్వలపాలెం రోడ్డులోని వెంకటేశ్వరస్వామి ఆలయం వరకు ర్యాలీ చేసి పూజలు చేశారు. రాష్ట్ర కార్యదర్శులు పేరిచర్ల విజయనర్సింహరాజు, ఏఎస్‌ రాజు, జిల్లా అధికార ప్రతినిధి కామన నాగేశ్వరరావు, యూత్‌ విభాగం జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్‌ పాల్గొన్నారు.

పాలకొల్లు నియోజకవర్గంలో..

నియోజకవర్గ కోఆర్డినేటర్‌ గుడాల శ్రీహరి గోపాలరావు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి పాలకొల్లు కెనాల్‌రోడ్డులోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేశారు. ఎస్సీ కమిషన్‌ మాజీ సభ్యుడు చెల్లెం ఆనంద ప్రకాష్‌, రాష్ట్ర కార్యదర్శి యడ్ల తాతాజీ, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్రా జయసరిత తదితరులు పాల్గొన్నారు.

తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో..

నియోజకవర్గ కోఆర్డినేటర్‌ వడ్డి రఘురాంనాయుడు సారథ్యంలో పార్టీ కార్యాలయం నుంచి భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా పట్టణంలోని పలు హిందూ దేవాలయాల్లో కూటమి కుట్రలతో ప్రజలకు నష్టం జరగకుండా పాప పరిహారం జరగాలని కోరుతూ పూజలు చేశారు.

ఉండి నియోజకవర్గంలో..

నియోజకవర్గ కోఆర్డినేటర్‌ పీవీఎల్‌ నరసింహరాజు ఆధ్వర్యంలో పెదఅమిరంలోని పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి గ్రామంలోని వెంకటేశ్వరస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు. జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు పెన్మెత్స ప్రసాదరాజు, జిల్లా కోశా ధికారి వేగేశ్న జయరామకృష్ణంరాజు పాల్గొన్నారు.

ఆచంట నియోజకవర్గంలో..

ఆచంటలో వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి.కూటమి నేతలకు మంచి బుద్ధిని ప్రసాదించమని కోరుతూ పార్టీ మండల కన్వీనర్‌ జక్కంశెట్టి శ్రీరాములు, ఆచంట మండల సర్పంచ్‌ల చాంబర్‌ అధ్యక్షుడు సుంకర సీతారాం తదితరులు పూజలు చేశారు.

ముదునూరి ప్రసాదరాజు, జిల్లా అధ్యక్షుడు

రాష్ట్ర చరిత్రలో భారీ కుట్ర పూర్తిగా బద్దలైంది. కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని వేదికగా చేసుకుని చంద్రబాబు ఆడిన నాటకం పూర్తిగా భగ్నమైంది. ఇంత నీచమైన రాజకీయాన్ని రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ చూడలేదు. రాజకీయ స్వార్థం కోసం భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు. చంద్రబాబు ఘోర అపచారం చేసిన కారణంగా, రాష్ట్రానికి ప్రజలకు ఎలాంటి నష్టం, కష్టం రాకూడదని రాకూడదని ఆ దేవుడ్ని ప్రార్థిస్తూ పాప పరిహార పూజలు చేశాం.

వంక రవీంద్రనాథ్‌, ఎమ్మెల్సీ

చంద్రబాబు రాజకీయాల కోసం దేన్నైనా వాడుకోవడం అలవాటు. ఆ అలవాటుతోనే కోట్లాది భక్తులు ఆరాధించే వెంకటేశ్వర స్వామిని, ప్రసాదాన్ని, పవిత్ర ఆలయాన్ని కూడా వాడుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో దేశంలోనే ప్రముఖమైన ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్‌ఐ ల్యాబ్‌ల్లో చేసిన పరీక్షల్లో జంతువుల కొవ్వుగాని, గొడ్డు కొవ్వుగాని, పంది కొవ్వు గాని ప్రసాదంలో వాడే నెయ్యిలో లేదని తేలిపోవడం అందరికీ చాలా సంతోషాన్ని ఇచ్చింది.

చినమిల్లి వెంకటరాయుడు, భీమవరం కోఆర్డినేటర్‌

సీఎం హోదాలో ఉండి తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు చేసిన నిరాధార ప్రకటన మహాపాతకం. ఆయన ఒక్కడే కాకుండా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, కూటమి నాయకులు, ఎల్లో మీడియా అందరూ కలిసి విష ప్రచారాన్ని రాష్ట్ర అంతటా వ్యాపింపజేశారు. ప్రసాదంలో కల్తీ జరగలేదని సీబీఐ ఇచ్చిన నివేదికపై ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు. తిరుమల ఆలయానికి తెచ్చిన అప్రతిష్టకు ఏ మూల్యం చెల్లిస్తారు?

పీవీఎల్‌ నరసింహరాజు, ఉండి కోఆర్డినేటర్‌

లడ్డూలో కల్తీ జరిగిందని చంద్రబాబు దుష్ప్రచారం చేశాడు. పవనన్‌ కళ్యాణ్‌ అయితే తిరుమల మెట్లు కడిగారు. వారి ప్రభుత్వంలో వేసిన సిట్‌ దర్యాప్తులో చంద్రబాబు ఆరోపణల్లో వాస్తవం లేదన్న విషయం నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రజలకు సమాధానం చెప్పలేక డైవర్షనన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కూటమి నాయకులు చేస్తున్న కుట్రలు ప్రజలకు తెలుసు. దేవుడితో రాజకీయాలు చేసిన వారికి తగిన శాస్తి తప్పదు.

గుడాల గోపి, పాలకొల్లు కోఆర్డినేటర్‌

సున్నితమైన అంశాలపై మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని గతంలోనే సుప్రీంకోర్టు హితవు పలికింది. భగవంతుడిని రాజకీయాల్లోకి లాగొద్దని, రాజ్యంగ పదవుల్లో ఉన్న వారు బాధ్యతగా వ్యవహరించాలని చురకలంటించింది. భక్తుల మనోభావాలను గాయపరుస్తూ, గత ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు, కూటమి నేతల దుష్ప్రచారానికి సీబీఐ నివేదిక చెంపపెట్టులాంటిది.

వడ్డి రఘురాంనాయుడు, తాడేపల్లిగూడెం కోఆర్డినేటర్‌

40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి దేవుళ్లను తీసుకువచ్చి పెద్ద తప్పు చేశారు. చంద్రబాబు అంటే అబద్దాల కోరన్న విషయం ప్రజలందరికీ తెలుసు. తన స్వార్థం కోసం సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి ప్రసాదం విషయంలో విష ప్రచారం చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. భక్తులకు చంద్రబాబు అండ్‌ కో క్షమాపణలు చెప్పాలి.

తాడేపల్లిగూడెం ర్యాలీలో గూడెం నియోజకవర్గ కన్వీనర్‌ వడ్డి రఘురాం, నాయకులు

పాలకొల్లు వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేస్తున్న గుడాల గోపి తదితరులు

కాళ్ల ఆలయం వద్దకు ర్యాలీగా వచ్చిన ఇన్‌చార్జ్‌ పీవీఎల్‌, పార్టీ నాయకులు

ఆచంటలో వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద వైఎస్సార్‌ సీపీ శ్రేణులు

తిరుమల ప్రసాదానికి చంద్రబాబు ఘోర అపచారం

వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో వైఎస్సార్‌సీపీ పాప పరిహార పూజలు

రాజకీయ స్వార్థం కోసం భక్తుల

మనోభావాలతో ఆడుకున్నారని ఆగ్రహం

నిరాధార ఆరోపణలపై బాబు, పవన్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌

కూటమి కల్తీ కుట్రలపై కన్నెర్ర 1
1/6

కూటమి కల్తీ కుట్రలపై కన్నెర్ర

కూటమి కల్తీ కుట్రలపై కన్నెర్ర 2
2/6

కూటమి కల్తీ కుట్రలపై కన్నెర్ర

కూటమి కల్తీ కుట్రలపై కన్నెర్ర 3
3/6

కూటమి కల్తీ కుట్రలపై కన్నెర్ర

కూటమి కల్తీ కుట్రలపై కన్నెర్ర 4
4/6

కూటమి కల్తీ కుట్రలపై కన్నెర్ర

కూటమి కల్తీ కుట్రలపై కన్నెర్ర 5
5/6

కూటమి కల్తీ కుట్రలపై కన్నెర్ర

కూటమి కల్తీ కుట్రలపై కన్నెర్ర 6
6/6

కూటమి కల్తీ కుట్రలపై కన్నెర్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement