పాలకొల్లులో చిత్రకళా ప్రదర్శన
పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లులో వపా బాపు ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దక్షిణ భారత చిత్రకారులచే ఆర్ట్ క్యాంపు, చిత్రకళా ప్రదర్శన శనివారం ప్రారంభించారు. స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాలు నందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిత్రకారులచే లైవ్ పెయింటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
లింగపాలెం: పంట కాలువలోకి ట్రాక్టర్ దూసుకెళ్లిన ఘటన శనివారం లింగపాలెం శివారులో చోటుచేసుకుంది. ఎస్‌బీఐ బ్యాంకు సమీపంలో ట్రాక్టర్ వెళుతుండగా ఒక్కసారిగా గేదెలు అడ్డు వచ్చేసరికి ట్రాక్టర్ డ్రైవర్ వాటిని తప్పించేందుకు సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో ట్రాక్టర్ అదుపు తప్పి పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. అదృష్టవశాత్తూ ఎవరికీ ఏమి కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
పాలకొల్లులో చిత్రకళా ప్రదర్శన


