రూ.7 కోట్ల చోరీ సొత్తు అందజేత
ఏలూరు టౌన్: చింతలపూడిలోని కనకదుర్గ ఫైనాన్స్ కంపెనీలో ఆడిటర్ భారీ చోరీకి పాల్పడ్డాడు. ఈ కేసును అత్యంత చాకచక్యంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పోలీసులు ఛేదించారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన ఆడిటర్ వడ్లమూడి ఉమమహేష్‌ను పోలీసులు అరెస్ట్ చేసి అతడి నుంచి భారీ ఎత్తున సుమారు రూ.7 కోట్ల విలువైన 4.490 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీ నం చేసుకున్నారు. ఈ బంగారు ఆభరణాలు 378 మంది ఖాతాదారులకు అందజేసేందుకు చర్యలు తీసుకున్నారు. జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ బంగారు ఆభరణాలను కనకదుర్గ ఫైనా న్స్ ప్రధాన కార్యాలయ ప్రతినిధులకు శుక్రవా రం అందజేశారు. వందలాది మంది ఖాతాదారులకు చెందిన బంగారు ఆభరణాలను తిరిగి రికవరీ చేయటంలో పోలీసుల కృషిని ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు అభినందించారు. జంగారెడ్డిగూడెం ఇన్‌చార్జి డీఎస్పీ యు.రవిచంద్ర, ఏలూరు మహిళ స్టేషన్ సీఐ ఎం.సుబ్బారావు, ఫైనాన్స్ కంపెనీ యాజమాన్యం ఉన్నారు.


