ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు లేఖా రచన పోటీలు
నూజివీడు: భారతీయ తపాలశాఖ, కర్ణాటక పోస్టల్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీలెటర్ టు మై రోల్ మోడల్ఙ్ అంశంపై 18 ఏళ్ల లోపు వయసున్న విద్యార్థులకు లేఖా రచన పోటీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నూజివీడు ట్రిపుల్ ఐటీలోని డీఎస్‌డబ్ల్యూ విభాగమైన లిటరరీ క్లబ్ నేతృత్వంలో 4,400 మంది విద్యార్థులకు లేఖా రచన పోటీని నిర్వహించారు. ఈ పోటీలో నూజివీడు ట్రిపుల్‌ఐటీ పీయూసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 1100 మంది, ఒంగోలు, శ్రీకాకుళం, నూజివీడు పీయూసీ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 3300 పాల్గొన్నారు. గుడివాడ డివిజన్ భారతీయ పోస్టల్ సర్వీసెస్ మార్కెటింగ్ విభాగం నుంచి ఆంజనేయులు పూర్తి సహకారం అందించారు. పోటీని చక్కగా నిర్వహించిన లిటరరీ క్లబ్ విద్యార్థులను ఇంగ్లీషు అధ్యాపకులు కాత్యాయని అభినందించారు. డైరెక్టర్‌తో పాటు పరిపాలనాధికారి లక్ష్మణరావు, అకడమిక్ డీన్ సాదు చిరంజీవి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.


