హిందువుల మనోభావాలు దెబ్బతీశారు | - | Sakshi
Sakshi News home page

హిందువుల మనోభావాలు దెబ్బతీశారు

Jan 31 2026 10:29 AM | Updated on Jan 31 2026 10:29 AM

హిందువుల మనోభావాలు దెబ్బతీశారు

హిందువుల మనోభావాలు దెబ్బతీశారు

హిందువుల మనోభావాలు దెబ్బతీశారు కూలి పనికి వెళ్లి మృతి ఓవర్‌ లోడుతో వాహనాలు నడపవద్దు

నరసాపురం రూరల్‌: తిరుమల లడ్డూ ప్రసాదంపై సీబీఐ సమర్పించిన నివేదికలో జంతువుల కొవ్వు, చేప నూనె వంటి ఆనవాళ్లు ఏమీ లేవని తేల్చారని, గతంలో చంద్రబాబు లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని వైఎస్సార్‌సీపీ ఎంబీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పెండ్ర వీరన్న అన్నారు. కూటమి నాయకులు కుట్రపూరితంగా. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురద జల్లడానికి, భక్తుల మనోభావాలను దెబ్బతీయడానికి లడ్డూను రాజకీయం చేశారని మండిపడ్డారు. పార్టీ అధిష్టానం పిలుపుమేరకు 31న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని దేవాలయాల్లో వెంకటేశ్వర స్వామి కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ పూజలను నిర్వహిస్తారన్నారు.

పాలకొల్లు సెంట్రల్‌: యలమంచిలి మండలం మేడపాడుకు చెందిన ఎస్‌.సోమరాజు (40) శుక్రవారం పాలకొల్లు మండలంలోని సగం చెరువులో పొలం పనికి వెళ్లాడు. పని చేస్తు స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే పొలం గట్టు వద్ద ఉన్న స్థానికులు పాలకొల్లు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ ఎస్సై బి సురేంద్రకుమార్‌ తెలిపారు.

పోలవరం రూరల్‌: మహాశివరాత్రి ఉత్సవాల్లో అధికంగా ప్రయాణికులను ఎక్కించి నడపరాదని జంగారెడ్డిగూడెం వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌ రంగనాయకులు, కె.రవిలు సూచించారు. పోలవరం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఆటో డ్రైవర్లతో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా తగు చర్యలు తీసుకుంటామన్నారు. 31వ జాతీయ భద్రతా మహోత్సవాలు సందర్భంగా రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement