మాతా శిశు మరణాలు సున్నాకు తగ్గించాలి
భీమవరం(ప్రకాశం చౌక్) : మాతృ మరణాలు శిశు మరణాలు సున్నా స్థాయికి తగ్గించడమే లక్ష్యంగా పనిచేయాలని డీఆర్‌ఓ బి.శివన్నారాయణ రెడ్డి అన్నారు. కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో శుక్రవారం డీఆర్‌ఓ అధ్యక్షతన గత ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు జిల్లాలో మాతా శిశు మరణాలపై కమిటీ సభ్యులతో సమీక్షించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ రెడ్డి జిల్లాలో మాతా శిశు మరణాలు రేటు సున్నాకు తీసుకురావాలన్నారు. మాతా మరణాలు శిశు మరణాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రసూతి అనంతరం జాగ్రత్త చర్యలు తీసుకుంటే 100 శాతం మరణాలు నివారించవచ్చన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జి.గీతాబాయి. డీసీహెచ్‌ఎస్ డాక్టర్ పి.సూర్యనారాయణ, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ అధికారి డి.శ్రీలక్ష్మీ, ప్రైవేట్ హాస్పిటల్స్ డాక్టర్లు, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు పాల్గొన్నారు.


