కారుణ్య నియామకాలతో భరోసా
ఏలూరు టౌన్ : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా హోంగార్డు యూనిట్‌లో పనిచేస్తూ అనారోగ్యంతో మృతిచెందిన హోంగార్డుల కుటుంబాల్లోని అర్హులైన వారికి కారుణ్య నియామకాలతో ఉద్యోగ అవకాశాలు కల్పించామని ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ చెప్పారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పలువురు హోంగార్డుల కుటుంబాల్లోని వ్యక్తులకు ఉద్యోగ నియామక పత్రాలను ఎస్పీ అందజేశారు. ఏలూరు హోంగార్డు యూనిట్‌లో పనిచేస్తూ మృతిచెందిన పెద్దిబోయిన రమేష్ భార్య స్వాతికి, అల్లం నాగవెంకట దుర్గాప్రసాద్ కుమారుడు అల్లం సత్యప్రకాష్‌కు, విప్పర నాగవెంకట సత్యనారాయణ కుమారుడు శ్రీనివాసరావు, ఆర్.రమణ కుమారుడు మణికంఠకు కారుణ్య నియామక పత్రాలను ఎస్పీ అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేసేందుకు దేవుడు మీకు మంచి అవకాశం కల్పించాడని, సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు ఉత్తమ సేవలందించాలని చెప్పారు. పోలీస్ వ్యవస్థలో భాగస్వాములు అవుతూ ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడేలా సేవలు అందించాలన్నారు.
జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్


