సీబీఐ నివేదిక కూటమికి చెంపపెట్టు
దెందులూరు: తిరుపతి లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవ లేదని సీబీఐ ఇచ్చిన నివేదిక కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి దని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగనన్న పాలనపై దుష్ప్రచారం చేస్తున్నారని, చంద్రబాబు స్వార్థ ప్రయోజనాలతో కలియుగ దైవం శ్రీవారిని కూడా వాడుకుంటున్నారని మండిపడ్డారు. కో ట్లాది ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ చే స్తున్న కుట్రగా తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని గుర్తు చేశారు. లడ్డూ ప్రసా దంలో జంతువుల కొవ్వు కలిపారన్న చంద్రబా బు, పవన్‌కల్యాణ్ ఆరోపణలపై సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు. ఇప్పు డు నిజం బయటపడిందని, చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అబ్బయ్యచౌదరి డిమాండ్ చేశారు.
భీమవరం(ప్రకాశం చౌక్): బాల్య వివాహాలతో అనర్థాలు తప్పవని, జిల్లాలో బాల్య వివాహాల నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. బాల్య వివాహ ముక్తభారత్ వంద రోజులు కార్యక్రమంలో భాగంగా జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల సంరక్షణ విభాగం, చైల్డ్ రైట్స్ అడ్వకేసి ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా రూపొందించిన బాల్య వివాహ వి ముక్తి రథాన్ని గురువారం ఆమె ప్రారంభించారు. పశ్చిమగోదావరిని బాల్యవివాహ రహి త జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషిచేయాలన్నా రు. ఫిబ్రవరి 11 వరకు ఈ రథం జిల్లావ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తుందన్నారు. ఐసీడీఎస్ పీడీ డి.శ్రీలక్ష్మి, జిల్లా బాలల సంరక్షణ అధికారి ఆర్.రాజేష్, చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ జిల్లా కో–ఆర్డినేటర్ ఆర్.శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఉగాది నాటికి ఇళ్లు
రానున్న ఉగాది నాటికి జిల్లాలో 9,135 గృహాలను లబ్ధిదారులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. క్యాంపు కార్యాలయం నుంచి జిల్లాలో గృహ నిర్మాణాల ప్రగ తిపై గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు.
కుష్టు నివారణ పక్షోత్సవాలు
జిల్లాలో వచ్చేనెల 13 వరకు కుష్ణు నివారణ పక్షోత్సవాల్లో భాగంగా స్పర్శ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు కలెక్టర్ తెలిపారు. వ్యాధి లక్షణాలు, నివారణ మార్గాలు, ఉచిత చికిత్సపై ప్రజలకు అవగాహన కల్పిచాలన్నారు.
ఆగిరిపల్లి: ఈదులగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన పథకంలో అవకతవకులకు పాల్పడినట్టు గుర్తించామని ఎంఈఓ–1 హేబేలు తెలిపారు. గురువారం పాఠశాలను తనిఖీ చేసి రికార్డులు, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. హాజరు రిజిస్టర్లలో 12 మంది విద్యార్థులు గైర్హాజరైనా మధ్యాహ్న భోజనంలో హాజరైనట్టు చూపించారని గుర్తించారు. అలాగే జీఎఫ్‌ఎల్‌ఎన్ రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించకపోవడం, తరగతి గదుల్లో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని గుర్తించామన్నా రు. ఈ మేరకు హెచ్‌ఎం శ్రీదేవి, ఉపా ధ్యా యులు కోటమ్మ, వెంకటేశ్వరరావుకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు.
ముగిసిన జేఈఈ మెయిన్స్
భీమవరం: జేఈఈ మెయిన్స్ పరీక్షలు గురువారంతో ముగిశాయి. భీమవరం డీఎన్నార్ కళాశా లలో 100 మంది విద్యార్థులకు 88 మంది, విష్ణు కళాశాల కేంద్రంలో 50 మందికి 44 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు జిల్లాలో ఇంటర్ ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలకు గురువారం 1,309 మంది విద్యార్థులు హాజరయ్యారు. 10 కేంద్రాల్లో పరీక్షలు జరగ్గా ఉదయం 807 మందికి 676 మంది, మధ్యాహ్నం 696 మందికి 633 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాను తెలిపారు.
సీబీఐ నివేదిక కూటమికి చెంపపెట్టు


