నేడు ఉండిలో బర్త్‌డే కోడిపందేలు?
టాస్క్‌ఫోర్స్: ఓ పందేలరాయిడి పుట్టినరోజు సందర్భంగా ఉండి నియోజకవర్గంలో బుధవారం రాత్రి భారీస్థాయిలో కోడిపందేలు నిర్వహించబోతున్నట్లు తెలిసింది. అందులో భాగంగా రాష్ట్రంలోని ప్రముఖ పందెంరాయిళ్లంతా మంగళవారం నాటికి భీమవరంలోని ప్రముఖ హోటల్‌కి చేరుకున్నట్లుగా సమాచారం. ఇటీవల నియోజకవర్గంలోని ఓ మండలంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కోడిపందేలు నిర్వహించిన బరిలోనే కోడిపందేలు జరపనున్నట్లు సమాచారం. దీనికి ఇప్పటికే పందెంరాయిళ్లంతా సిద్ధంగా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో పందెంరాయిడి పుట్టినరోజును పురస్కరించుకుని తెలంగాణలో నిర్వహించిన జూద క్రీడలను పోలీసులు పట్టుకోవడంతో ఈ ఏడాది వేదిక ఉండికి మారినట్లు సమాచారం.
ఏలూరు (టూటౌన్): ఈనెల 28వ తేదీ నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఏపీ పునర్విభజన చట్ట ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంపు అంశం ప్రస్తావించాలని, తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల పెంపు సాధన సమితి జాతీయ కన్వీనర్ పొలిమేర హరికృష్ణ డిమాండ్ చేశారు స్థానిక సంఘ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ విభజన చట్టంలో తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పదేళ్ల లోపు పెంచుకోవచ్చని పేర్కొనబడిందని, ఇప్పటికి 12 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో వెంటనే ఈ ప్రక్రియను ప్రారంభించాలన్నారు, 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికల సమయానికి ఏపీలో 225, తెలంగాణలో 153 సీట్లకు ఎన్నికలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలను, వివిధ రాజకీయ పార్టీల పెద్దలను కోరుతున్నట్లు హరికృష్ణ చెప్పారు, ఈ సమావేశంలో సమితి రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.
నేడు ఉండిలో బర్త్‌డే కోడిపందేలు?


