ఎన్‌సీసీ క్యాడెట్‌ గన్‌ మిస్‌ఫైర్‌ | - | Sakshi
Sakshi News home page

ఎన్‌సీసీ క్యాడెట్‌ గన్‌ మిస్‌ఫైర్‌

Jan 28 2026 8:42 AM | Updated on Jan 28 2026 8:42 AM

ఎన్‌స

ఎన్‌సీసీ క్యాడెట్‌ గన్‌ మిస్‌ఫైర్‌

కల్తీ విత్తనాలతో నష్టం

కల్తీ విత్తనాలతో నష్టం
కల్తీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోయామని కొయ్యలగూడెం మండలం పొంగుటూరు, గవరవరం గ్రామాల సమీపంలో మొక్కజొన్న రైతులు గగ్గోలు పెడుతున్నారు. 8లో u

ఓ ఇంటి రెండో అంతస్తులో అద్దం ధ్వంసం

ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం

నరసాపురం: నరసాపురం కొండాలమ్మ గుడి ప్రాంతంలో మంగళవారం తుపాకీ పేలుడు కలకలం రేపింది. సమీపంలో వైఎన్‌ కళాశాల గ్రౌండ్‌లో ఎన్‌సీసీ క్యాడెట్ల గన్‌ ఫైరింగ్‌ మిస్‌ అయ్యి ఈ ప్రమాదం జరిగిందని తెలుసుకుని కుదుట పడ్డారు. ఉదయం 12.30 గంటల సమయంలో కొండాలమ్మగుడి ప్రాంతంలో కొపనాతి రాము ఇంటి రెండో అంతస్తులో భారీ శబ్ధంతో అద్దం ముక్కలైంది. ఆ అంతస్తులో మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ఆ సమయంలో పనివారు లేదు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉంటున్న యజమాని రాము వచ్చి పరిశీలించగా బుల్లెట్‌ లభించింది. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని ఆరాతీశారు. రెండు గంటల పాటు ఏం జరిగిందో తెలియక ఆందోళన చెందారు. నేవీ, ఎన్‌సీసీ క్యాంపులు వైఎన్‌ కళాశాల గ్రౌండ్‌లో జరుగుతుంటాయి. క్యాంపులో గన్‌ఫైరింగ్‌ ప్రాక్టీస్‌ సమయంలో ఓ క్యాడెట్‌ గన్‌ నుంచి మిస్‌ ఫైరింగ్‌ జరిగి బుల్లెట్‌ 200 మీటర్లు దూరంలో ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. బుల్లెట్‌ మిస్‌ ఫైర్‌ అయినా నేవల్‌, ఎన్‌సీపీ అధికారులు, వైఎన్‌ కళాశాల యాజమాన్యం ఏమీ తెలియనట్టుగా వ్యవహరించారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్‌సీసీ క్యాడెట్‌ గన్‌ మిస్‌ఫైర్‌ 1
1/1

ఎన్‌సీసీ క్యాడెట్‌ గన్‌ మిస్‌ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement