చైన్ స్నాచింగ్ కేసుల్లో ఇద్దరి అరెస్ట్
కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 3 వరకు జాతర మహోత్సవం జరుగుతుందని ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు ఆదివారం చెప్పారు. ఇందుకు సంబంధించి జరిగిన రాట ముహుర్తానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారన్నారు. కార్యక్రమంలో ఆలయ ఉప ప్రధాన అర్చకులు పేటేటి పరమేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం: వృద్ధ మహిళలను టార్గెట్ చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. లక్కవరం ఎస్సై షేక్ జబీర్ తెలిపిన వివరాలు ఇవి. గతేడాది సెప్టెంబర్‌లో జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం గ్రామ శివారు పొలాల్లో పాకనాటి సావిత్రి అనే వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు దోపిడీ చేసిన కేసులో, అలాగే జీలుగుమిల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో మరో మహిళ చెవిదుద్దులు దోపిడీ చేసిన కేసులో ఇద్దరిని అరెస్టు చేశామన్నారు. ఈ రెండు కేసుల్లోనూ జంగారెడ్డిగూడెంకు చెందిన భీమడోలు నాగ ఫణీంద్ర, బోర నరేంద్రలను నిందితులుగా గుర్తించి వారి నుంచి సుమారు రూ.3 లక్షలకు పైగా విలువ చేసే చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిని కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. కేసు ఛేదనలో కృషి చేసిన క్రైంపార్టీ ఏఎస్సై ఎన్‌వీ సంపత్‌కుమార్, కానిస్టేబుళ్లు రమేష్, షాన్‌బాబు, లక్కవరం ఏఎస్సై భాస్కర్, కానిస్టేబుళ్లకు రివార్డు కోసం ఎస్పీకి సిఫార్సు చేయనున్నట్లు చెప్పారు.
చైన్ స్నాచింగ్ కేసుల్లో ఇద్దరి అరెస్ట్


