అదనపు కట్నం వేధింపులపై కేసు | - | Sakshi
Sakshi News home page

అదనపు కట్నం వేధింపులపై కేసు

Jan 25 2026 8:04 AM | Updated on Jan 25 2026 8:04 AM

అదనపు కట్నం వేధింపులపై కేసు

అదనపు కట్నం వేధింపులపై కేసు

అదనపు కట్నం వేధింపులపై కేసు తల్లిని కోల్పోయాం.. ప్రభుత్వమే ఆదుకోవాలి

యలమంచిలి: అదనపు కట్నం వేధింపులపై యలమంచిలి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ శ్యాంసన్‌రాజు తెలిపిన వివరాలివి. మండలంలోని ఇలపకుర్రు గ్రామానికి చెందిన మౌనికకు నరసాపురం మండలం లిఖితపూడికి చెందిన లక్కవరపు మార్క్‌తో 2007లో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె కలిగిన తరువాత మౌనిక ఉపాధి కోసం గల్ఫ్‌ వెళ్లింది. అక్కడ సంపాదించిన డబ్బంతా భర్తకు పంపింది. చెడు వ్యసనాలకు అలవాటు పడిన మార్క్‌ భార్య పంపిన డబ్బంతా విచ్చలవిడిగా ఖర్చు చేశాడు. ఇటీవల మౌనిక ఇంటికి వచ్చిన తరువాత అదనపు కట్నం కావాలంటూ మార్క్‌ శారీరికంగా, మానసికంగా వేధించడం ప్రారంభించాడు. దీంతో విసుగు చెందిన బాధితురాలు మౌనిక పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు.

జంగారెడ్డిగూడెం: ఇటీవల జరిగిన దాడిలో తమ తల్లిని కోల్పోయామని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ జంగారెడ్డిగూడెం వచ్చిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌ యాదవ్‌ను ఇటీవల హత్యకు గురైన కలపాల జీలుగులమ్మ కుమార్తెలు కోరారు. ఈ మేరకు ఎంపీకి వినతిపత్రం అందజేశారు. వారసత్వంగా తమకు రావాలసిన పొలం తమకు ఇవ్వకపోగా, గొడ్డలితో విచక్షణా రహితంగా దాడి చేసి తమ తల్లి జీలుగులమ్మ, అమ్మమ్మ ముప్పిడి చుక్కమ్మలను హత్య చేసి తమకు ఆధారం లేకుండా చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. తమ తల్లి ఎంతో కష్టపడి తమను ఉన్నత చదువులు చదివించిందని తెలిపారు. తమకు ప్రభుత్వమే ఉపాధి కల్పించి ఆదుకోవాలని కోరారు. స్పందించిన ఎంపీ కలెక్టర్‌తో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కొండ్రెడ్డి కిషోర్‌, ఎస్సై ఎన్‌వీ ప్రసాద్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement