రైతుకు భరోసా కరువు | - | Sakshi
Sakshi News home page

రైతుకు భరోసా కరువు

Jan 24 2026 9:00 AM | Updated on Jan 24 2026 9:00 AM

రైతుక

రైతుకు భరోసా కరువు

పొగాకు సాగులో మెలకువలు వంద కేంద్రాలు మూసివేత

న్యూస్‌రీల్‌

పొగాకు సాగులో మెలకువలు
వర్జీనియా పొగాకు సాగు ఆశాజనకంగా లేదని రైతులు అంటున్నారు. మెలకువలు పాటించాలని బోర్డు అధికారులు సూచిస్తున్నారు. IIలో u

శనివారం శ్రీ 24 శ్రీ జనవరి శ్రీ 2026

సాక్షి, భీమవరం: విత్తు నుంచి పంట ఉత్పత్తుల విక్రయం వరకు సాగులో అడుగడుగునా రైతులకు అండగా నిలిచిన రైతు భరోసా కేంద్రాలకు (ఆర్‌ బీకే) గ్రహణం పట్టింది. రేషనలైజేషన్‌ పేరిట చంద్రబాబు ప్రభుత్వ కుదింపు చర్యలతో కనుమరుగవుతున్నాయి. జిల్లాలో 409 ఆర్‌బీకేలకు గాను ప్ర స్తుతం వాటి సంఖ్య 309కి తగ్గిపోయింది. ప్రస్తుతం కొనసాగుతున్న వాటిలో రైతులకు సేవలు అంతంతమాత్రంగానే అందుతున్నాయి.

గత ప్రభుత్వంలో రైతు సేవే లక్ష్యంగా..

జిల్లాలో వరి ఆయకట్టు 2.49 లక్షల ఎకరాలు కాగా, ఉద్యాన పంటల విస్తీర్ణం 34,951 ఎకరాలు వరకు ఉంది. సుమారు 3 లక్షలు మంది రైతులు, 80 వేలకు పైబడి కౌలు రైతులు ఉన్నారు. 1.5 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. రైతు ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ జగన్‌ ప్రభుత్వంలో పురుడుపోసుకున్న ఆర్‌బీకేలు సాగులో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాయి. ఎరువులు, పురుగు మందులు, రైతులకు అవసరమైన అన్ని సేవలు, సూచనలు, సలహాలు అందించే లక్ష్యంతో జిల్లావ్యాప్తంగా 409 ఆర్‌బీకేలను ఏర్పాటుచేశారు. వీటిలో రూ.65 కోట్లతో 298 ఆర్‌బీకేలకు భవనాల నిర్మాణం చేపట్టారు. విత్తు నుంచి పంట ఉత్పత్తులను విక్రయించుకునే వరకు అన్నదాతలకు ఇవి అడుగడుగునా అండయ్యాయి. అక్రమాలకు తావులేకుండా సబ్సిడీపై విత్తనాలు, ఎరువులతో పాటు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, పంట రుణాలు, విపత్తులతో నష్టం వాటిల్లితే ఇన్‌ఫుట్‌ సబ్సిడీ, బీమా పరిహారం అందించడంలో కీలకపాత్ర పోషించాయి. సాగు కాలంలో రవాణా, కూలీ ఖర్చుల రూపంలో రైతుకు వేలాది రూపాయలు ఆదా చేస్తూ ఆదర్శంగా నిలిచాయి. గత ప్రభుత్వంలో 5,89,999 మంది రైతులకు రూ.765.81 కోట్లు రైతు భరోసా సాయం, 1,14,011 మంది రైతులకు రూ.217.64 కోట్లు ఉచిత పంటల బీమా, 1,40,015 మంది రైతులకు రూ.103.47 కోట్లు ఇన్‌ఫుట్‌ సబ్సిడీని అందించాయి. యాంత్రీకరణలో భాగంగా 248 కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల (సీహెచ్‌సీ) ద్వారా 40 శాతం సబ్సిడీపై రైతులకు రూ.20.7 కోట్లు విలువైన వ్యవసాయ యంత్ర పరికరాలతో పాటు కోట్లాది రూపాయల పంట రుణాలు, వడ్డీ రాయితీ తదితర సేవలందించాయి.

యలమంచిలి మండలంలో గతంలో 23 రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బీకేలు) ఉండేవి. రేషనలైజేషన్‌ పేరిట సిబ్బందిని సర్దుబాటు చేసి 16కు కుదించారు. అడివిపాలెం కేంద్రాన్ని మేడపాడుకు, కొంతేరు కేంద్రాన్ని కాజ తూర్పునకు, కలగంపూడి కేంద్రాన్ని చించినాడకు, నార్నిమెరక, మట్లపాలెం కేంద్రాలను కాంబోట్లపాలేనికి, అబ్బిరాజుపాలెం కేంద్రాన్ని దొడ్డిపట్లకు, కట్టుపాలెం కేంద్రాన్ని ఇలపకుర్రులో కలిపేశారు. ఆయకట్టు అధికంగా ఉన్న కొంతేరు కేంద్రాన్ని కాజ తూర్పులో కలపడంతో రైతులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. అలాగే మట్లపాలెం, నార్నిమెరక గ్రామాల్లో సుమారు 600 ఎకరాల వరి ఆయకట్టు ఉంది. ఈ గ్రామాల్లోని ఆర్‌బీకేలను మూసివేసి, రెండు గ్రామాలకు సుదూరంగా ఉన్న కాంబోట్లపాలెంలో కలపడం వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్‌బీకేలకు చంద్ర గ్రహణం

రేషనలైజేషన్‌ పేరిట సిబ్బంది సర్దుబాటు

జిల్లాలో 309కి తగ్గిన రైతు సేవా కేంద్రాలు

100 కేంద్రాల్లో నిలిచిన సేవలు

ఉన్న వాటిలోనూ నామమాత్రంగా సేవలు

రైతులకు అండగా రైతు భరోసా కేంద్రాలను తెచ్చిన జగన్‌ ప్రభుత్వం

చంద్రబాబు సర్కారులో నిండా నిర్లక్ష్యం

రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్చిన చంద్రబాబు ప్రభుత్వం రేషనలైజేషన్‌ పేరిట సచివాలయం పరిధిలో ఒకటి చొప్పున ఉన్న ఆర్‌బీకేను 400 హెక్టార్ల నుంచి 600 హెక్టార్లకు ఒకటిగా కుదించింది. రెండు మూడు ఆర్‌బీకేలను ఒకటిగా సర్దుబాటు చేయడంతో జిల్లాలో గతంలో 409 ఉన్న ఆర్‌బీకేలు 309కి తగ్గిపోయాయి. అంటే వంద కేంద్రాల్లోని సేవలకు మంగళం పాడారు. దీంతో గతంలో గ్రామంలోనే అందిన ఆర్‌బీకే సేవల కోసం రైతులు పక్క గ్రామాల్లో ఏర్పాటుచేసిన కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న వాటిలో 240 మంది విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు, 40 మంది హార్టికల్చర్‌ అసిస్టెంట్లు, 25 మంది ఎంపీఈఓలు మాత్రమే పనిచేస్తున్నారు. గతంలో ఆర్‌బీకేల్లో ఎరువులు అందించగా కూటమి ప్రభుత్వం దీనిని ఎత్తివేసింది. ప్రస్తుతం రైతులు కోరిన చోట మాత్రమే ఈ సదుపాయం కల్పిస్తున్నారు. రైతు సేవా కేంద్రాల్లో సిబ్బంది సరిగా అందుబాటులో ఉండక సేవలు సక్రమంగా అందడం లేదని రైతులు అంటున్నారు.

రైతుకు భరోసా కరువు 1
1/1

రైతుకు భరోసా కరువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement