ఎలక్ట్రిక్ స్కూటర్ దగ్ధం
ఆకివీడు: మండలంలోని అజ్జమూరులో శుక్రవారం మధ్యాహ్నం ఎలక్ట్రిక్ స్కూటర్ దగ్ధమైంది. అజ్జమూరుకు చెందిన నరహరశెట్టి విమల కుమారి బైక్‌పై కుప్పనపూడి వెళుతుండగా, ఊరు బయటకు వచ్చే సమయానికి వాహనం వెనుక పొగలు రావటం గుర్తించిన వ్యక్తి వెంటనే ఆమెకు చెప్పారు. ఆమె వాహనాన్ని వదిలేసి పారిపోయారు.
పాలకొల్లు సెంట్రల్: బయటకు వెళ్లి వస్తానని చెప్పిన యువకుడు వారం రోజులు తరువాత శవమై తేలాడు. పాలకొల్లు మండలంలోని లంకలకోడేరు గ్రామానికి చెందిన వర్ధనపు కిరణ్‌కుమార్ (20) ఈ నెల 18వ తేదీన రాత్రి ఇంటి వద్ద నెలమూరులో జరుగుతున్న జాతరకు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లాడు. శుక్రవారం వెంకటాపురం గ్రామం వద్ద రాపాక పంట కాలువలో శవమై తేలాడు. కిరణ్‌కుమార్ పట్టణంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. తల్లిదండ్రులు గల్ప్ దేశంలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు కాగా.. తాతయ్య ఇంటిలో ఉంటున్నారు. మృతుడి మేనమామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పెనుగొండ: వడలిలో ఒకే రోజు మూడు ఆలయాల్లో చోరీ సంచలనంగా మారింది. పెనుగొండ సిద్ధాంతం ఆర్ అండ్ బీ రహదారి పక్కన ఉన్న ఉన్న రెండు ఆలయాల్లో, మునమర్రులో రోడ్డులోని ఒక ఆలయంలోనూ దొంగలు డిబ్బీలు బద్దల కొట్టి చోరీకి పాల్పడ్డారు. కమ్మవారి వినాయకుడి ఆలయం, పడమర వీధి తెలగా కాపు సంఘం భక్తాంజనేయ స్వామి ఆలయం, తూర్పు వీధి గౌడ సంఘం పుంతలో ముసలమ్మ ఆలయంలో చోరీ చేసారు.
జంగారెడ్డిగూడెం : నలుగురు మహిళలపై దాడి చేసి, ఇద్దరిని హత్య చేసిన ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు జంగారెడ్డిగూడెం ఇన్‌చార్జి డీఎస్పీ యు.రవిచంద్ర తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం వివరాలు వెల్లడించారు. పట్టణంలో హరిజనపేటలో కలపాల చిన జీలుగులమ్మ తన తల్లి ముప్పిడి చుక్కమ్మ, కుమార్తెలు కలపాల ధనలక్ష్మి, పెడపెట్ల ఉషారాణితో కలిసి జీవిస్తోంది. 25 ఏళ్లుగా పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి విషయంలో బంధువులకు, జీలుగులమ్మ కుటుంబానికి కోర్టు తగాదాలు ఉన్నాయి. ఈ నెల 20న రాత్రి 8.30 గంటల సమయంలో నిందితులు ముప్పిడి వివేక్, ముప్పిడి మణిమహేంద్ర, ముప్పిడి నాగేశ్వరి, కొత్తూరి శ్యామ్‌కుమార్, మరో మైనర్ జీలుగులమ్మ కుటుంబం నడిచే దారిలో మంత్రించిన పసుపు, కుంకుమ, ఎండుమిరప కాయలు, నిమ్మకాయలను వేశారు. దీంతో గొడవ జరిగింది. నిందితులు 112కు కాల్ చేయగా, పోలీసులు ఇరువర్గాలను స్టేషన్‌కు పిలిపించి గొడవ సర్దుబాటు చేసి పంపారు. అనంతరం నిందితులు జీలుగులమ్మ ఇంట్లోకి ప్రవేశించి దాడి చేశారు. ముప్పిడి వివేక్ విచక్షణారహితంగా దాడి చేయడంతో జీలుగులమ్మ, ఆమె తల్లి చుక్కమ్మ, కుమార్తెలు కలపాల ధనలక్ష్మి, పెడపెట్ల ఉషారాణి గాయపడ్డారు. జీలుగులమ్మ బంధువులు అడ్డురాగా, వారిపై కూడా దాడి చేశారన్నారు. తీవ్రంగా గాయపడిన జీలుగులమ్మ, ఆమె తల్లి చుక్కమ్మ చికిత్స పొందుతూ మృతిచెందగా.. మిగిలిన ఇద్దరు చికిత్స పొందుతున్నారు. నిందితులను అరెస్టు చేసిన రిమాండ్‌కు తరలించామని డీఎస్పీ తెలిపారు. మైనర్‌ను జువైనల్ కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.
ఎలక్ట్రిక్ స్కూటర్ దగ్ధం
ఎలక్ట్రిక్ స్కూటర్ దగ్ధం


