నేటి నుంచి శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ ఉత్సవాలు
దెందులూరు: కోస్తా జిల్లాల్లో ఇలవేల్పుగా నమ్మి కొలిచే దెందులూరు మండలం గాలాయగూడెం శ్రీ అచ్చమ్మ పేరంటాల తల్లి 69 వ వార్షికోత్సవ ఉత్సవాలు శనివారం ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 2వరకు ఉత్సవాలు జరుగుతాయి. శుక్రవారం సాయంత్రం ఆలయంలో ఏర్పాట్లను దెందులూరు తహసీల్దార్ బీ.సుమతి పరిశీలించారు.
ద్వారకాతిరుమల: రథ సప్తమి వేడుకలకు శ్రీవారి క్షేత్రం ముస్తాబవుతోంది. అందులో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు శుక్రవారం ఆలయాన్ని, పరిసరాలను కడిగి శుభ్రం చేశారు. శ్రీవారు, అమ్మవార్ల తిరువీధి సేవలకు వినియోగించే సూర్య, చంద్ర ప్రభ వాహనాలను దేవస్థానం సిబ్బంది వాహనశాల నుంచి బయటకు తీశారు. శనివారం వాటిని శుభ్రం చేయనున్నారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 25న ఉదయం 7 నుంచి స్వామి, అమ్మవార్లకు సూర్యప్రభ వాహనంపై, రాత్రి 7 గంటల నుంచి చంద్రప్రభ వాహనంపై తిరువీధి సేవలను కన్నులపండువగా నిర్వహిస్తామని ఆలయ ఈఓ వై.భద్రాజీ తెలిపారు. భక్తులు ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు.
దెందులూరు: కొల్లేరులో శుక్రవారం ఏలూరు రూరల్ మండలం ప్రత్తికోళ్ళలంక గ్రామంలో రీసర్వే కోసం వెళ్లిన ఫారెస్ట్ అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. రీ సర్వేలో డీఆర్‌ఓ సెక్షన్ ఆఫీసర్ ఫారెస్ట్ సిబ్బంది ఉంటారు. వారిపై ఫారెస్ట్ రేంజర్ పర్యవేక్షణ చేస్తారు. 2006లో జీపీఎస్ ఫైనల్ కాబట్టి కొత్తగా రీ సర్వే అవసరం లేదని తేల్చి చెప్పారు. పాత సరిహద్దుల్ని నిర్ణయించిన నేపథ్యంలో వాటిని కొనసాగించాలని అధికారులకు గ్రామస్తులు సూచించారు.
నేటి నుంచి శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ ఉత్సవాలు


