డీఎన్నార్‌ కళాశాలలో చదరంగం పోటీలు | - | Sakshi
Sakshi News home page

డీఎన్నార్‌ కళాశాలలో చదరంగం పోటీలు

Jan 24 2026 9:00 AM | Updated on Jan 24 2026 9:00 AM

డీఎన్నార్‌ కళాశాలలో చదరంగం పోటీలు

డీఎన్నార్‌ కళాశాలలో చదరంగం పోటీలు

డీఎన్నార్‌ కళాశాలలో చదరంగం పోటీలు డ్వాక్రా ఆర్పీలపై కేసు నమోదు

పాలకొల్లు సెంట్రల్‌ : స్థానిక దాసరి నారాయణరావు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అంతర్‌ కళాశాలల మహిళల చదరంగం పోటీలను నిర్వహించారు. శుక్రవారం కళాశాల ప్రిన్సిపాల్‌ డా.శోభారాణి మాట్లాడుతూ చదరంగంతో మనిషి మేథో శక్తి పెంపొందుతుందన్నారు. ఆలోచనా శక్తి, చురుకుదనం పెరుగుతుందన్నారు. నన్నయ్య యూనివర్శిటీ తమ కళాశాలలో ఈ పోటీలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వడం అభినందనీయమని కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోటీల్లో ఎనిమిది కళాశాలలకు సంబంధించి డైబ్బె మంది విద్యార్థినులు పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పి.రాధాకృష్ణ, వైస్‌ ప్రిన్సిపాల్‌ రవిశంకర్‌, నోబుల్‌ రాజు, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

ఆకివీడు: స్థానిక సంతమార్కెట్‌ కి చెందిన లాభాని సుధారాణి, సుందరయ్య కాలనీకి చెందిన వడ్లమూడి హేమలతలు డ్వాక్రా మహిళలకు చెందిన సొమ్ము కాజేయడంతో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై హనుమంతు నాగరాజు శుక్రవారం చెప్పారు. 19 సంఘాల్లో మొత్తం రూ.1,32,94,700 సుధారాణి సుధారాణి దుర్వినియోగం చేయగా.. హేమలత 12 సంఘాల్లో రూ.1,08,39,800 దుర్వినియోగం చేశారని, ఈ మోసంలో గతంలో బ్యాంకులో పనిచేసిన అధికారులు పాత్ర కూడా ఉందని ఎం. జయకృష్ణ కమ్యూనిటీ ఆర్గనైజర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement