ఇదేం చోద్యం బాబూ
న్యూస్‌రీల్
హెల్మెట్ భారం కాదు.. భద్రత
ద్విచక్ర వాహనచోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, దీని ద్వారా ప్రాణరక్షణ కలుగుతుందని రవాణా శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. 8లో u
శురకవారం శ్రీ 23 శ్రీ జనవరి శ్రీ 2026
సాక్షి, భీమవరం: ఏడాదిన్నర పాలనలో రూ.రెండు న్నర లక్షల కోట్ల పైనే అప్పులు తెచ్చినా ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలు నిర్మించలేని దుస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. ప్రజలు, రైతులకు పాలనను చేరువ చేస్తూ గత ప్రభుత్వం తెచ్చిన సచివాలయ, ఆర్‌బీకే, అగ్రిల్యాబ్ తదితర వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తోంది. వీటికోసం నిర్మించిన ప్రత్యేక భవనాలను ఇతర అవసరాలకు వినియోగిస్తోంది.
గత ప్రభుత్వంలో గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా..
ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం ప్రజలు వ్యయప్రయాసల కోర్చి మండల, జిల్లా కేంద్రాలకు రావాల్సిన పనిలేకుండా మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయ, ఆర్‌బీకే, హెల్త్ క్లీనిక్, అగ్రిల్యాబ్ తదితర వ్యవస్థలతో పాలనను వారి చెంతకు చేర్చారు. వీటికోసం జిల్లాలో రూ.141.2 కోట్లతో 353 సచివాలయ, రూ.65 కోట్లతో 298 ఆర్‌బీకే, రూ.53.5 కోట్లతో 214 హెల్త్ క్లీనిక్ భవనాల నిర్మాణం చేపట్టారు. ప్రజలు, ఉద్యోగులకు సౌకర్యవంతంగా ఉండేలా కార్పొరేట్ తరహాలో ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. సచివాలయాల్లో ఉద్యోగుల కోసం కింద రెండు గదులు, ఒక హాల్, శానిటేషన్ సామాగ్రి ఉంచేందుకు స్టోర్ రూం, మొదటి అంతస్తులో రెండు గదులు, సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా విశాలమైన హాల్‌తో నిర్మాణాలు చేశారు. ఆర్‌బీకే భవనాన్ని ఒక వరండా, వ్యవసాయ సిబ్బంది కోసం రెండు గదులు, రైతులతో సమావేశాల నిర్వహణ, ఎరువులు, భూసార పరీక్షలు, వ్యవసాయ సమాచారం ప్రద ర్శన, కియోస్కో ఏర్పాటుకు వీలుగా విశాలమైన హాలుతో డిజైన్ చేశారు. వైద్యుడి గది, ల్యాబ్, స్థానికంగా వైద్య సిబ్బంది నివాసం ఉండేందుకు, ఇతర వసతులతో హెల్త్ క్లీనిక్‌లు నిర్మించారు. అప్పట్లోనే 270 వరకు సచివాలయ, 211 ఆర్‌బీకే, 96 హెల్త్ క్లీనిక్‌ల నిర్మాణాలు పూర్తిచేశారు. మిగిలినవి వివిధ దశల్లో అసంపూర్తిగా ఉన్నాయి. వీటిని పూర్తిచేసి వినియోగంలోకి తెచ్చేందుకు చొరవ చూపని చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే పూర్తయిన భవనాల్లో ఇతర కార్యాలయాలను ఏర్పాటుచేస్తోంది.
చంద్రబాబు సర్కారు వింత పోకడ
రూ.కోట్లు అప్పులు తెస్తున్నా కార్యాలయాలకు భవనాలు నిర్మించలేని దుస్థితి
సచివాలయ, ఆర్‌బీకేల్లోకి ప్రభుత్వ కార్యాలయాలు
కొత్తగా తెచ్చిన డీడీఓ వ్యవస్థకు సచివాలయ భవనాలే దిక్కు
జిల్లాలో పదికి పైనే భవనాల బదలాయింపు
తాజాగా అగ్రి ల్యాబుల్లో ఏడీఏ కార్యాలయాల ఏర్పాటుకు కసరత్తు


