● రాళ్లు పరిచారు.. రోడ్డు మరిచారు | - | Sakshi
Sakshi News home page

● రాళ్లు పరిచారు.. రోడ్డు మరిచారు

Jan 23 2026 9:08 AM | Updated on Jan 23 2026 9:08 AM

● రాళ

● రాళ్లు పరిచారు.. రోడ్డు మరిచారు

● రాళ్లు పరిచారు.. రోడ్డు మరిచారు

వాహన రాకపోకలతో దుమ్ములేస్తూ..

ఉండి–గణపవరం రోడ్డు మరమ్మతుల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నాణ్యత లేమి, నామమాత్రంగా పనులపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఉండి సెంటర్‌ నుంచి 14 కిలోమీటర్ల మేర పనులను ఇష్టారీతిలో చేసేశారు. దీంతో సంక్రాంతి అతిథులకు గోతుల్లో ప్రయాణం తప్పలేదు. ఇదిలా ఉండగా ఉండి సెంటర్‌కు సమీపంలో సుమారు 10 మీటర్ల పొడవున పూర్తిగా రోడ్డును తొలగించి రాళ్లు, క్వారీ డస్ట్‌తో నింపారు. అయితే తారు రోడ్డు వేయడం మాత్రం మరిచిపోయారు. దీంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్వారీ డస్ట్‌తో పెద్ద ఎత్తున దుమ్ములేస్తోంది. రోడ్డు మరమ్మతులకు సంబంధించి అధికారులను సంప్రదిద్దామంటే ఫోన్‌లో కూడా అందుబాటులో ఉండకపోవడం గమనార్హం. – ఉండి

● రాళ్లు పరిచారు.. రోడ్డు మరిచారు 1
1/1

● రాళ్లు పరిచారు.. రోడ్డు మరిచారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement