పూతపైనే ఆశలన్నీ | - | Sakshi
Sakshi News home page

పూతపైనే ఆశలన్నీ

Jan 23 2026 9:08 AM | Updated on Jan 23 2026 9:08 AM

పూతపైనే ఆశలన్నీ

పూతపైనే ఆశలన్నీ

పూతపైనే ఆశలన్నీ ● అగ్రి ల్యాబుల్లోకి కార్యాలయాలు ● కూటమి క్రెడిట్‌ చోరీ

నూజివీడు నియోజకవర్గంలో మామిడి పూతలు బాగుండటంతో రైతులు ఆశతో ముందుకు సాగుతున్నారు. దాదాపు 85 శాతం తోటల్లో పూతలు వచ్చాయి. 8లో u

సాగులో నకిలీల బెడద లేకుండా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ఆక్వా సీడు, ఫీడు అందించేందుకు ప్రతి నియోజకవర్గంలో రూ.కోటి చొప్పున వ్యయంతో నిర్మించిన అగ్రిల్యాబ్‌లను సైతం దారి మళ్లిస్తున్నారు. ఇప్పటికే ఉండి ల్యాబ్‌ నుంచి వ్యవసాయ శాఖ ఏడీఏ కార్యాలయంగా కార్యకలాపాలు సాగిస్తుండగా త్వరలో మార్టేరులోని ల్యాబులోను ఏడీఏ కార్యాలయం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జిల్లాలోని పలుచోట్ల శిథిల భవనాల్లోని ప్రభుత్వ కార్యాలయాలను ఆయా గ్రామాల్లోని ఆర్‌బీకే, సచివాలయ భవనాల్లో ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో నేతలు ఉన్నట్టు సమాచారం.

ఏదైనా కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరినప్పుడు వాటికి కొత్త భవనం నిర్మించాలి. అందుకు భిన్నంగా చంద్రబాబు ప్రభుత్వం సచివాలయ, ఆర్‌బీకే భవనాలను ఖాళీ చేయించి వాటిలోకి తరలిస్తోంది. ఆకివీడులోని ఆర్‌బీకేలో రూరల్‌ సీఐ కార్యాలయాన్ని ఏర్పాటుచేయగా, కాళ్ల మండలం కాళ్లకూరులోని ఆర్‌బీకేలో కాళ్ల పోలీస్‌ స్టేషన్‌, ఉండి ఆర్‌బీకేలో ఉండి పోలీస్‌ స్టేషన్‌ పాలకోడేరు సచివాలయంలో తహసీల్దార్‌ కార్యాలయం, ఇరగవరం మండలంలోని సచివాలయంలో అంగనవాడీ కేంద్రం ఏర్పాటు చేశారు. నరసాపురం రూరల్‌ లక్ష్మణేశ్వరంలోని ఆర్‌బీకేలో మొన్నటివరకు ఆక్వా యూనివర్సిటీ కళాశాల విద్యార్థులకు తరగతులు నిర్వహించేవారు. పంచాయతీరాజ్‌లో కొత్తగా తెచ్చిన డివిజినల్‌ డెవలప్‌మెంట్‌ కార్యాలయాలను సైతం సచివాలయ భవనాల్లోనే ఏర్పాటు చేయడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement