పెండింగ్ కేసులు పరిష్కరించాలి
భీమవరం: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో రాజీపడేది లేదని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశించారు. గురువారం ఎస్పీ క్యాంపు కార్యాలయం నుంచి పోలీసు అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. కేసుల్లో దర్యాప్తు నాణ్యతను పెంచాలని ప్రధానంగా పోక్సో, మహిళా చట్టాల కేసులతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో నిర్దేశిత గడువు లోపు చార్జిషీట్లు దాఖలు చేయాలన్నారు. నేరస్తుల కు న్యాయస్థానాల్లో శిక్షలు పడేలా చేయడంలో కోర్టు కానిస్టేబుళ్ల పాత్ర కీలకమని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో అలసత్వం సహించబోమని హెచ్చరించారు. ఏఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు, డీఎస్పీలు రఘువీర్‌విష్ణు, జి.శ్రీవేద, డి.విశ్వనాథ్, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ కేవీవీఎన్ సత్యనారాయణ, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ దేశంశెట్టి వెంకటేశ్వరరావు, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రాంబాబు, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అహ్మదున్నీషా పాల్గొన్నారు.


